September 19, 2023

Telugu

 • ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం: పార్లమెంట్ కొత్త భవనంలో మోడీ
  on September 19, 2023 at 8:18 am

  న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ  తెలిపారు.కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ  మంగళవారంనాడు ప్రసంగించారు. .పార్లమెంట్ భవనం మారింది, భావనలు కూడ మారాలన్నదే తన ఆకాంక్ష అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  గణేష్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టామన్నారు. అజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలంగా  ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ లో సభకు ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నామని  ప్రధాని మోడీ చెప్పారు.ఆధునికతకు అద్దం పట్టడంతో  పాటు చరిత్రను  ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్టుగా మోడీ పేర్కొన్నారు. . అమృత కాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టుగా  ప్రధాని మోడీ  చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సెంగోల్‌ది కీలక పాత్ర అని  మోడీ గుర్తు చేశారు. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువు దీరిందన్నారు. కొత్త సంకల్పంతో  కొత్త భవనంలోకి అడుగు పెట్టినట్టుగా ప్రధాని మోడీ చెప్పారు. భారత్ నేతృత్వంలో  జీ 20 సదస్సును ఘనంగా నిర్వహించిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. వినాయక చవితి అంటే అందరికీ తిలక్ గుర్తు వస్తారన్నారు.తమ ప్రయోజనం కోసం కాకుండా దేశ హితం కోసం  పనిచేయాలని ప్రధాని మోడీ రాజకీయ పార్టీలకు సూచించారు.

 • రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు.. చంద్రబాబు ప్రజలను నమ్ముకోలేదు: సీఎం జగన్
  on September 19, 2023 at 8:17 am

  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎల్లో మీడియా, దత్తపుత్రుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో రూ. 224.31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.  అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన వాడిగా ఈ ప్రాజెక్టును యుద్దప్రతిపాదికన  చేపట్టడం జరిగిందని తెలిపారు.  గత ప్రభుత్వం ప్రాజెక్టు  కోసం భూమి సేకరించలేదు కానీ.. టెంకాయ కొట్టేందుకు  8 ఎకరాలు  కొన్నదని అన్నారు. గతంలో చెరువులను నింపాలనే ఆలోచన చేయలేదని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు, టెంకాయలు గుర్తుకు వస్తాయని, ఒక జీవో కాపీ గుర్తుకు వస్తుందే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడూ జరగలేదని చెప్పారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానని.. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిపారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు హంద్రీనీవా మీద రూ. 13 కోట్లు ఖర్చు చేశారని.. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 6 వేల కోట్లతో హంద్రీనీవా కాలువ తీసుకొచ్చారని చెప్పారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఈ ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించాలని కోరారు. గతానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని అన్నారు. గత నాలుగేళ్లలో 2.35 లక్షల కోట్లను అక్కాచెల్లెమ్మల ఖాతాలను నేరుగా పంపించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే అదే బడ్జెట్, అదే రాష్ట్రం, అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే తక్కువేనని అన్నారు. మరి అప్పటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు.  చంద్రబాబు ప్రజలను నమ్ముకోలేదని.. ఆయన నమ్ముకుంది  ఎల్లో మీడియా, దత్తపుత్రుడు మీదేనని విమర్శించారు. దోచుకోవడం.. దోచుకుంది వారితో పంచుకోవడమే చంద్రబాబు చేశారని ఆరోపించారు. అందుకే ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ప్రశ్నించడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పరిపాలన మారిందని చెప్పారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా.. అర్హత ఉంటే చాలు లబ్ది చేకూరుస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో స్కూళ్లలో తేడాలను గమనించాలని కోరారు. ఈరోజు స్కూళ్లు ఇంగ్లీష్ మీడియంగా మారాయని అన్నారు. గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలా అన్ని విధాలుగా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.   వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం, గవర్ననెన్స్, మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్న, చివరకు సామాజిక న్యాయం తీసుకున్నా.. తమ ప్రభుత్వానికి సాటి ఎవరూ లేరని చెప్పడానికి సంతోష పడుతున్నట్టుగా చెప్పారు. అబద్దాలు, మోసాలు నమ్మవద్దని కోరారు. రానున్న రోజుల్లో అబద్దాలు, మోసాలు ఇంకా పెరుగుతాయని అన్నారు. ‘‘మనకు టీవీలు లేవు, పేపర్లు లేవు.. మనకు ఎల్లో మీడియా లేదు, దత్తపుత్రుడు లేడు. నేను వాళ్లను నమ్ముకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచినే నమ్ముకున్నాను..మీకు మంచి జరిగితేనే మీ బిడ్డకు తోడుగా నిలవండి’’ అని జగన్ పేర్కొన్నారు.   

 • చిలగడదుంపలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?
  on September 19, 2023 at 8:16 am

  చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచుగా తినాలంటుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే వీటిని రోజూ తింటే ఏం కాదా?    చిలగడదుంపలు తీయగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కు9వగా ఉంటాయి. వీటిని తింటే బరువు పెరిగిపోతామన్న భయం కూడా ఉండదు. నిజానికి ఇవి మనం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.  100 గ్రాముల చిలగడదుంపల్లో 86 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే వీటిలో ప్రోటీన్, ఫైబర్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, బరువును నియంత్రణలో ఉంచడానికి బాగా సహాయపడతాయి. చిలగడదుంపల్లో ఫైబర్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ బి6 కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి చిలగడదుంపలను తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలు మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. చిలగడదుంపలను రోజూ తింటే ఎసిడిటీ,  కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గిపోతాయి. చిలగడదుంపలు మన పొట్ట ఆరోగ్యానికి కూడా ప్రయోజకరంగా ఉంటాయి.  చిలగడదుంపలో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే మన ఎముకలు, దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ చిలగడదుపంల్లో విటమిన్ ఎ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే వీటిని తింటే మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలకు దూరంగా ఉంటారు. చిలగడదుంపలను తింటే వృద్ధాప్యం వల్ల వచ్చే దృష్టి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.  డయాబెటీస్ పేషెంట్లు కూడా చిలగడదుంపలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. అయినా వీటిలో నేచురల్ షుగర్ ఉంటుంది. అందుకే మధుమేహులు వీటిని మోతాదులోనే తినాలి. చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మంపై ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

 • తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరు… ఆర్నెళ్ళకో సీఎం..: హరీష్ రావు సంచలనం
  on September 19, 2023 at 8:16 am

  సంగారెడ్డి : ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల అమలు కాదు ఆర్నెళ్లకో సీఎం మారడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు. ఆరు నెలలకు ఓసారి అల్లర్లు జరిగ కర్ఫ్యూ, 24గంటల ఉచిత విద్యుత్ బదులు ఆరుగంటలే కరెంట్ వుంటుందని… వారానికి రెండు పవర్ హాలిడేలు ఉంటాయన్నారు. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారంటూ సంచనల వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేలకు మళ్లీ డిల్లీ హైకమాండ్ అవుతుందని… వయా రెండో రాజధాని బెంగళూరు మీదుగా డిల్లీ వెళ్లాల్సి వస్తుందని హరీష్ రావు   అన్నారు.  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు, 350మందికి గృహలక్ష్మి పట్టాలను మంత్రి హరీష్ అందజేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీ హామీలు అమలయ్యేవి కావని… కేవలం ఎన్నికల కోసమే వీటిని ప్రకటించారని అన్నారు. ఈ గ్యారెంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటివని అన్నారు. బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి సూచించారు. ఇప్పుడు చేస్తున్నట్లు రేపటికి కూడా సీఎం కేసీఆర్ చాలా చేస్తారన్నారు. త్వరలోనే బిఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని… ఇది ఎంతో అద్భుతంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మాటిచ్చాడంటే చేసి చూపిస్తాడని… అందుకు నిదర్శనమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణమని హరీష్ అన్నారు. నారాయణ్ ఖేడ్ కి ఏం కావాలో సీఎం కేసీఆర్ కు తెలుసు… అందులో భాగంగానే రూపాయి ఖర్చు లేకుండానే వంద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చారని అన్నారు. ఇవాళ వారు ఎంతో ఆనందంగా ఇళ్లల్లోకి వెళుతున్నారని హరీష్ అన్నారు.  Read More  తెలంగాణలో కాంగ్రెస్ కు 70 పైగా సీట్లు ఖాయం..: ఏపిసిసి చీఫ్ రుద్రరాజు ఎన్నికల్లో ప్రజల ఓట్లకోసమే కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ అన్నారు. ఇక్కడ తెలంగాణలో ఇచ్చిన హామీలను ముందు అధికారంలో వున్న కర్ణాటకలో అమలు చేసి మాట్లాడాలని అన్నారు. పక్కనేవున్న కర్ణాటకలో కేవలం రూ.600 పించన్ ఇస్తున్నారు… రైతు బంధు లాంటి పథకమే లేదన్నారు.  కరెంట్ కోతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. కానీ తెలంగాణలో ఏదో చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లు అధికారంలో వుండి ప్రజలకు చేసిందేమీలేదన్నారు హరీష్ రావు. కానీ ఈ పదేళ్లలో తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. తాగునీటి సమస్యతో బాధపడే నారాయణఖేడ్ ప్రాంతంలో ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్ళు ఇస్తున్నామని అన్నారు. ఇక కాళేశ్వరం నుండి సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాన్ని తడుపుతామని మంత్రి అన్నారు.  కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఏం చేసారో చెప్పకుండా కేవలం కేసీఆర్ ను తిట్టడమే ఆ పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారని హరీష్ అన్నారు. వీరి తిట్లు పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజలకు కిట్లు ఇస్తున్నారని అన్నారు. కాబట్టి కిట్లు ఇచ్చే వాళ్ళు కావాలో, తిట్టేవాళ్ళు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రజా నాయకుడు… కాబట్టి ఆయనను మరోసారి గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేయాలని నారాయణఖేడ్ ప్రజలను కోరారు హరీష్ రావు.   

 • క్యూట్ సెల్ఫీలతో కలవరపెడుతున్న ‘చిరుత’ హీరోయిన్.. ఆ విషయంలో నేహా శర్మ మరీ స్లో.!
  on September 19, 2023 at 8:14 am

  ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు అలా పరిచయమై మాయమైపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది.    యంగ్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma)  కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘చిరుత’లో నటించిన విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.    ఇలా మొదటి సినిమానే భారీ స్థాయిలో చేసింది. తొలి చిత్రంతోనే హిట్ కూడా అందుకుంది. ఈ సినిమా 2007లో విడుదలైంది. నేహా తన గ్లామర్, నటన, డాన్స్ తో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికిందని అనుకోగానే మాయమైపోయింది.   తెలుగులో ‘చిరుత’ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమా చేసింది నేహా. అంతే ఈ రెండు చిత్రాల తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. ఇక్కడి నుంచి కూడా పెద్దగా ఆఫర్లు అందనట్టు కనిపిస్తోంది. దాంతో బాలీవుడ్ ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చింది.   సౌత్ లో ఆ మధ్య మలయాళం, తమిళంలో ఒక్కో సినిమా చేసినట్టు కనిపించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నార్త్ నుంచి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.  కానీ అప్పటికే మంచి క్రేజ్ దక్కించుకున్న నేహా శర్మ మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని కనిపిస్తోంది. హిందీ చిత్రాల్లోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ సౌత్ లో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిమానులు, పలువురు అభిప్రాయపడుతున్నారు.    కానీ ఆ విషయంలో మాత్రం నేహా మరీ స్లోగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలు, టూర్లు, వేకెషన్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంటోంది. తాజాగా ఓ రిస్టార్ట్ కు వెళ్లిన నేహా క్యూట్ సెల్ఫీలను పంచుకుంది. మరిన్నిపిక్స్ ను షేర్ చేసింది.  

 • మెడలో కొండ చిలువ పెట్టుకొని యువకుడి సర్ఫింగ్.. రిజల్ట్ ఇదే..!
  on September 19, 2023 at 8:13 am

  కొండ చిలువ పేరు వింటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు.  దానిని ఊహించుకోవడానికే భయపడుతుంటే, రియల్ గా ఓ వ్యక్తి దానిని పబ్లిక్ లోకి తీసుకువస్తే, జనాలు ఎంత భయపడిపోతారో స్పెషల్ గా  చెప్పక్కర్లేదు. ఓ వ్యక్తి తాజాగా తన మెడలో కొండ చిలువను వేసుకొని పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేశాడు ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా, ఈ ఘటనపై అధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళితే,  ఒక ఆస్ట్రేలియన్ సర్ఫర్ తన మెడ చుట్టూ కొండచిలువను చుట్టుకొని బయటకు వచ్చాడు.  నిర్భయమైన సర్ఫర్ ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో తన పెంపుడు కొండచిలువను తీసుకొని వెళ్లాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే సరీసృపాన్ని బహిరంగంగా ఉంచడానికి అతని వద్ద అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి 2,322 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 12,495) జరిమానా విధించారు. “ఒక జంతువును బహిరంగంగా తీసుకెళ్లడానికి లేదా ప్రదర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం” అని క్వీన్స్‌లాండ్ పర్యావరణ, విజ్ఞాన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. పాములకు ఈత ఈదడం సులభం కాబట్టి, అవి సులభంగా నీటిలో తప్పించుకోగలవని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే షార్క్ లతో ఇబ్బంది పడుతుతంటే, మళ్లీ ఈ పాములను తీసుకువస్తారా అని  అధికారులు సీరియస్ అయ్యారు. కార్పెట్ కొండచిలువలు విషం లేని పాములు, ఇవి మూడు మీటర్ల (సుమారు 10 అడుగులు) పొడవు వరకు పెరుగుతాయి. అయితే, ఇవి మనిషిని బిగించి, ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి.

 • ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో ఇదే! సోషల్ మీడియాలో చక్కర్లు..
  on September 19, 2023 at 8:02 am

  తాజాగా దేశ ప్రధాని నరేంద్ర  మోదీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నరేంద్ర   మోడీ అండ్ భారతదేశపు టీనేజ్ ప్రాడిజీ ప్రజ్ఞానానంద ఒక పెద్ద చెస్  బోర్డుకు ఎదురుగా కూర్చొని ఉంటారు.   చెస్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన తర్వాత ప్రగ్నానందను కలిసిన నరేంద్ర మోదీ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడుతున్న, పతకాన్ని చూస్తున్న ఫోటోలను కూడా అందులో షేర్ చేసారు.  ‘ప్రజ్ఞానానంద ఇంకా అతని కుటుంబంతో ఉన్న ఫోటో  ‘ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం’ అనే క్యాప్షన్‌తో నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫోటో కింద వేలాది మంది ప్ర‌గ్నానంద‌ను అభినందిస్తూ, ప్ర‌ధాన‌మంత్రిని స‌పోర్ట్ చేసినందుకు ప్ర‌శంసిస్తూ కామెంట్స్ చేసారు. 43 లక్షల మందికి పైగా ఈ ఫోటోని  లైక్ చేయగా  ఇటీవల నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యధికంగా లైక్ చేసిన ఫోటో కూడా  ఇదే. భారతదేశ చంద్రయాన్-3 విజయం తర్వాత, ప్రగ్నానందతో ఉన్న ఫోటో  ‘చంద్రునిపై భారతదేశ పాదముద్ర’ పేరుతో మోడీ షేర్ చేసిన  వైరల్ ఫోటోని  అధిగమించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 42 లక్షల మందికి పైగా ఈ ఫోటో  లైక్ చేశారు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ గ్రాఫిక్స్‌కి కూడా 40 లక్షల లైక్స్ వచ్చాయి.   18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానానంద చెస్‌లో గొప్ప విజయాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు. ప్రగ్నానంద తన మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా అండ్  ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానో వంటి వారిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు క్లాసిక్ రౌండ్లలో ప్రపంచ నంబర్ 1 కార్ల్ సన్ ను కట్టడి చేసిన ప్రజ్ఞానంద.. టైబ్రేకర్ లో ఓటమిని అంగీకరించాడు. దీని ద్వారా ప్రపంచకప్ చెస్ టోర్నీలో రజత పతకం సాధించిన ప్రజ్ఞానానంద.. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు.  2005లో నాకౌట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. 2000 అండ్  2002లో విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలుచుకున్నప్పుడు, టోర్నమెంట్‌లు 24 మంది ఆటగాళ్లతో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగాయి.

 • కొత్త పార్లమెంట్ భవనం: కొలువుదీరిన లోక్ సభ
  on September 19, 2023 at 8:00 am

  న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారంనాడు మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి . పాత పార్లమెంట్ భవనం నుండి  కొత్త పార్లమెంట్ భవనం వరకు  ప్రధాని నరేంద్ర మోడీ సహా  ఎంపీలు  పాదయాత్రగా  కొత్త పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.   కొత్త పార్లమెంట్ భవనంలో తమ తమ స్థానాల్లో  ఎంపీలు కూర్చుకున్నారు.  జాతీయ గీతంతో  లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనానికి  పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా  లోక్ సభ స్పీకర్  ఓంబిర్లా ప్రసంగించారు.

 • Telangana Assembly Elections: ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ఏర్పాట్లు.. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో రాజ‌కీయ పార్టీల‌తో ఈసీ భేటీ
  on September 19, 2023 at 8:00 am

  Hyderabad: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బృందం అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు తెలంగాణలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం బృందం పర్య‌టించ‌నుంది. దీనికోసం ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఈ బృందం కీలక సమావేశం నిర్వహించనుందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. వివిధ భాగస్వాములతో మమేకం కావడం, ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడం, స్థానిక సమాజంతో సంభాషించడం ఈ పర్యటన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ సోమవారం తెలిపారు. తొలిరోజు ఉన్నతాధికారులతో కూడిన ఈసీఐ బృందం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో సమావేశమై రాబోయే ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు ఈ బృందం క్షేత్రస్థాయిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయనుంది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఎస్పీలు/ పోలీసు కమిషనర్లు ఈసీ బృందానికి సవివరంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఈ బృందం కీలక సమావేశం నిర్వహించి రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థలతో సంప్రదింపులు జరపనుంది. పర్యటనలో మూడో రోజు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యకలాపాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ఉంటుంది. ప్రజాస్వామిక ప్రక్రియలో అవగాహన, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ఐకాన్లు, వికలాంగుల (దివ్యాంగ) ఓటర్లు, యువ ఓటర్లతో ఈసీ బృందం సంభాషిస్తుంది. కాగా, 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్-డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఓటర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి.

 • ఆ సీన్ చూస్తే భయం వేస్తుంది, నాచేత బలవంతంగా చేయించారంటున్న సదా, వైరల్ కామెంట్స్..
  on September 19, 2023 at 7:58 am

  తన జీవితంలో ఒక్క సీన్ తనను బాగా ఇబ్బంది పెట్టిందని అంటోంది స్టార్  సీనియర్ హీరోయిన్ సదా. దర్శకుడు బలవంతంగా ఆ సీన్ చేయించాడంటుంది బ్యూటీ. ఇంతకీ ఏంటా సీన్.. ?  ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం, కష్టాలు, నష్టాలు.., కన్నీళ్ళు,  ఇబ్బందులు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ లో.. కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులతో పాటు.. ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సంఘటన గురించి వివరించించి సీనియర్ హీరోయిన్ సదా.  ఇండస్ట్రీలో హీరోయిన్స్‎తో మిస్ బిహేవ్ చేయడం, కమిట్ మెంట్ అడిగి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇలాంటి సంటనలు చాలా చూస్తుంటాం. సదా మాత్రం   ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన తేజ.  సదా మాట్లాడుతూ.. ఆ సినిమా  విషయంలో  ఆ సీన్ చూస్తే ఇప్పటికీ  కంపరంగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది సదా.  జయం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో..  అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఓ దశాబ్ధం పాటు.. వరుస సినిమాలతో.. స్టార్ హీరోల సరసనన నటిస్తూ.. ఊపు ఊపేసింది.  హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న క్రమంలో.. బుల్లితెరపై మెరిసింది బ్యూటీ. డాన్స్ షోలకు జడ్జ్ గా హడావిడి చేసింది. ఇక ప్రస్తుతం సినిమాలు లేకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. ఇంకా అమ్మడికి సరైన ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే సదాకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదో పాటతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది సదా. ఆ సినిమాలోని ఓ సీన్ తన జీవితంలో మర్చిపోలేని చేదు గురుతుగా నిలిచిపోయింది అన్నారు సదా. నితిన్ కలుసుకోవడానికి ఆమె గుడిలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు తెలియకుండా నితిన్ కలుస్తుంది. అప్పుడే ఆ విషయాన్ని కనిపెట్టిన గోపీచంద్ ముందుగానే అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆసీన్ లో విలన్ గా గోపీచంద్ రాక్షసానందం పొందుతాడు..  గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను సినిమాలోనుంచి తీసేయండి అంటూ ప్రాధేయపడిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడట.  అంతే కాదు సదా ఇబ్బంది చూసి.. విలన్ గా చేస్తున్న  గోపీచంద్ కూడా వద్దులేండి సార్.. ఆమె అంత ఇబ్బంది పడుతుంది అన్నారట. కాని తేజ మాత్రం  నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. ఇక అక్కడ ఉన్నవారు కూడా సదాకు  సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ తనకు జీవితంలో గుర్తుండిపోతుంది అంటున్నారు.  ఇక ఆసీన్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ల బాగా ఏడ్చిందట సదా. అంతే కాదు..  పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ బాధపడుతుంట. అందుకే సినిమా చూస్తే.. ఆ సీన్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తుందట సదా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 • ఒలింపియన్ మహిళా రెజ్లర్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్, హర్యానా వ్యక్తి అరెస్ట్..
  on September 19, 2023 at 7:57 am

  హర్యానా : ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఓ వ్యక్తి ఏకంగా ఒలింపియన్ మహిళా రెజ్లర్ ఫోటోనే మార్ఫింగ్ చేశారు. ఈ మార్ఫింగ్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశాడు. హర్యానాకు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను సర్క్యులేట్ చేస్తున్న 30 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో.. ఉన్నది మహిళా రెజ్లర్‌ కాదు. ఆమెకు దానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి నిందితుడు వీడియో  క్లిప్ లో వాడుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. సంవిధాన్ సదన్‌గా పాత పార్లమెంటు భవనం: పేరు ప్రతిపాదించిన ప్రధాని మోడీ దీనిమీద రెజ్లర్ తండ్రి జింద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హిసార్ జిల్లాకు చెందిన నిందితుడు అమిత్‌ని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 30 సెకన్ల నిడివి గల వీడియోలో నిందితుడు రెజ్లర్ మార్ఫింగ్ చేసిన ఫోటోను ఉపయోగించాడు. వీడియో క్లిప్ లో ఉన్నది వేరే పురుషుడు, మహిళ.  ‘‘ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా అందులో తనతోపాటు ఉన్నది తన స్నేహితురాలని సదరు రెజ్లర్ కాదని స్పష్టం చేశాడు. తానెప్పుడూ ఆ రెజ్లర్ ను కలవలేదని తెలిపాడు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలో ఉన్న రెజ్లర్ వీడియో నిజం కాదని తెలిపారు”అని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా.. మంగళవారం కోర్టులో రిమాండ్‌ని తీసుకుని విచారిస్తామని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అతడిపై కేసు నమోదు చేశారు.

 • సంవిధాన్ సదన్‌గా పాత పార్లమెంటు భవనం: ప్రధాని మోడీ ప్రతిపాదన
  on September 19, 2023 at 7:53 am

  న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పాత పార్లమెంటు భవనానికి సంవిధాన్ సదన్ అనే పేరు పెట్టాలని సూచించారు. నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ముందు ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పాత పార్లమెంటు భవన ప్రతిష్ట, కీర్తిని ఇసుమంతైనా తక్కువ చేయడానికి లేదని అన్నారు. ఈ భవనంలో 75 ఏళ్లపాటు సమావేశాలు జరిగాయని, ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ భవనం వేదిక అని వివరించారు. రాజ్యాంగం ఈ భవనంలోనే రూపుదిద్దుకుందని తెలిపారు. కాబట్టి, ఈ భవనాన్ని సునాయసంగా పాత పార్లమెంటు భవనం అనడం సరికాదని వివరించారు. దీని గౌరవాన్ని ఎప్పటిలాగే కొనసాగించాలని చెప్పారు. అందుకే ఈ భవనానికి సంవిధాన్ సదన్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని వివరించారు. సంవిధాన్ సదన్ అనే పేరు ఈ పార్లమెంటు భవనంలో చరిత్ర లిఖించిన మన నాయకులకు నివాళిగా ఉంటుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ భవనాన్ని భావి తరాలకు బహుమానంగా ఇచ్చే అవకాశాన్ని కోల్పోరాదని వివరించారు. నూతన పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికి ముందు పాత పార్లమెంటు భవనంలో సెంట్రల్ హాల్‌లో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. నూతన పార్లమెంటులోకి మంగళవారం అంటే ఈ ఐదు రోజుల సమావేశాల్లో రెండో రోజున ప్రవేశిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ఎంపీలు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అందరు ఎంపీలకు రాజ్యాంగం, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, సంస్మరణ నాణెం, ఓ స్టాంప్‌లతో కూడిన బ్యాగ్‌ను అందించారు.  Also Read: భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే? నూతన పార్లమెంటు భవనానికి బదిలీ కావడంలో మరో మార్పును కూడా మనం చూడొచ్చు. పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్‌లను మార్చారు. ఉభయ సభల్లోనూ మారిన యూనిఫామ్‌తో స్టాఫ్ కనిపిస్తారు.

 • అతనొక్కడూ ఫామ్‌లో ఉంటే చాలు, వరల్డ్ కప్ గెలిచేస్తారు… టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్…
  on September 19, 2023 at 7:53 am

  ఆసియా కప్ 2023 టైటిల్ విజేతగా నిలిచిన భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. 10 ఏళ్లుగా ప్రపంచ కప్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈసారి మాత్రం కప్పు మిస్ చేయదని గట్టిగా ఫిక్స్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్.. 2013లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఫార్మాట్లు మారినా, కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు తారుమారు అయినా ఐసీసీ టైటిల్ మాత్రం రావడం లేదు.. ధోనీ కెప్టెన్సీలో 2014, 2016 టీ20 వరల్డ్ కప్స్, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు, విరాట్ కోహ్లీ సారథ్యంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 టోర్నీల్లో విఫలమైంది.. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ సారథ్యంలోనూ 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచుల్లో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఇప్పుడు ఆశలన్నీ 2023 వన్డే వరల్డ్ కప్‌పైనే ఉన్నాయి..   ‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే, టీమిండియా, వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవకుండా ఆపడం చాలా కష్టం. ఎందుకంటే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో హార్ధిక్ పాండ్యా కీ బ్యాటర్. అలాగే బౌలింగ్‌లోనూ అతనే ఎక్స్‌ ఫ్యాక్టర్ అవుతాడు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు రాబట్టగల బౌలర్ మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేయగలడు.. ఇంగ్లాండ్‌కి బెన్ స్టోక్స్, కీ ప్లేయర్ అవుతాడు. బెన్ స్టోక్స్, రీఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే నేను, ఇంగ్లాండ్‌ని వరల్డ్ కప్ ఫెవరెట్స్‌గా పరిగణించేవాడిని కాదు. ఆస్ట్రేలియాకి కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ కీ ప్లేయర్లు అవుతారు.. ఎలాంటి పిచ్ మీద అయినా బ్యాటింగ్ చేయగలగడం, వికెట్లు తీయడం ఈ ప్లేయర్ల ప్రత్యేకత. అలాగే వరల్డ్ కప్ ఆడే చాలా టీమ్స్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే హార్ధిక్, బెన్ స్టోక్స్, స్టోయినిస్ లాంటి ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లుగా మారతారు.. గత ఏడాది రాహుల్ ద్రావిడ్ ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో మేం ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామని కామెంట్ చేశాడు. వాళ్లు ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ దాకా వచ్చారు.  ఈసారి స్వదేశంలో వరల్డ్ కప్ ఆడబోతుండడం టీమిండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ వ్యూహాలకు పదును చెప్పే సమయం వచ్చేసింది.. ఈసారి గెలవలేకపోతే, టీమిండియా చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్..  

 • కొత్త పార్లమెంట్ భవనంలోకి: పాదయాత్రగా చేరుకున్న ప్రధాని సహా ఎంపీలు
  on September 19, 2023 at 7:46 am

  న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనంనుండి  కొత్త పార్లమెంట్ భవనంలోపలికి  ఎంపీలు అడుగు పెట్టారు. ప్రధాని మోడీ సహా  కేంద్రమంత్రులు, ఎంపీలు  పాత పార్లమెంట్ భవనం నుండి  కొత్త పార్లమెంట్ భవనానికి  పాదయాత్రగా చేరుకున్నారు.   పాత పార్లమెంట్ భవనంలోని  సెంట్రల్ హాల్ లో మంగళవారంనాడు   ఎంపీల సమావేశం  ముగిసింది.   ఈ సమావేశం ముగిసిన వెంటనే  ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర మంత్రులు  రాజ్ నాథ్ సింగ్,  అమిత్ షా సహా పలువురు ఎంపీలు  పాత పార్లమెంట్ భవనం నుండి  కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు. పాత పార్లమెంట్ భవనం నుండి  కొత్త పార్లమెంట్ భవనానికి ఎంపీలు పాదయాత్రగా వెళ్లారు.    

 • మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రధానికి పదేళ్లు ఎందుకు పట్టింది – రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్
  on September 19, 2023 at 7:43 am

  మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ సోమవారం ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లును నేడు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పలు ప్రశ్నలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి మోడీకి పదేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారని కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయని తెలిసినప్పటికీ.. మోడీ దాదాపు పదేళ్లు ఎందుకు వేచి చూశారు. బహుశా 2024 కారణం కావచ్చు. అయితే ఓబీసీ మహిళలకు ప్రభుత్వం కోటా కల్పించకపోతే 2024లో యూపీని కూడా బీజేపీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆలోచించండి’’ అని పేర్కొన్నారు.  Women’s Reservation Bill : Wonder why Modi ji, if introduced, waited for almost 10 years when almost all political parties are in support ? 2024 is perhaps the reason But if the government does not provide quota for OBC women BJP may also lose UP in 2024 ! Think about it ! — Kapil Sibal (@KapilSibal) September 19, 2023 కాగా.. యూపీఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తరువాత సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే అనేక సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తుంటారు.  ఇదిలా ఉండగా.. సోమవారం సాయత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఇందులో మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించే ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు ఆమోదం లభించిదని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే ఈ సమావేశం ముగిసిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఎక్స్ లో పోస్టు చేశారు. కానీ కొన్ని గంటల్లోనే ఆ పోస్టును తొలగించారు.   

 • మద్యం మత్తులో దారుణం : పసికందును బొమ్మలా ఎగరేస్తూ ఆడుకున్న మహిళలు.. అరెస్ట్…
  on September 19, 2023 at 7:29 am

  అమెరికా : ఓ చిన్నారిని బొమ్మలాగా పైకీ, కిందికి ఎగరేస్తూ… చిత్రహింసలకు గురి చేశారు ఇద్దరు మహిళలు. మద్యం మత్తులో బార్ బయటే ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఆ మహిళలిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  యునైటెడ్ స్టేట్స్‌లోని డేటోనా బీచ్‌ బార్ వెలుపల మద్యం మత్తులో ఓ పసికందును “బొమ్మలాగా” అటూ ఇటూ విసిరినందుకు ఇద్దరు మహిళలు అరెస్టయ్యారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, బ్రియానా లాఫో, (19), సియెర్రా న్యూవెల్ (20) అనే ఇద్దరు గత వారం అరెస్టు అయ్యారు. వీరిద్దరిపై చైల్డ్ అబ్యూజ్ కింద కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అఫిడవిట్ ప్రకారం లాఫోమీద మరో కేసుకూడా ఉన్నట్లు తెలుస్తోంది.  చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే డేటోనా బీచ్‌లోని సీబ్రీజ్ బౌలేవార్డ్‌లోని కొయెట్ అగ్లీ సెలూన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు శిశువును గాలిలోకి విసిరి, తలక్రిందులుగా చేసి ఆడుకున్నారు. చిన్నారిని 4 అడుగుల దూరం నుండి ముందుకు, వెనుకకు విసిరేస్తూ రాక్షసానందం పొందారు. దీని మీద పోలీసులు స్పందించారు. ఈ సంఘటనను ఒక ప్రత్యక్స సాక్షి వీడియో తీశాడు. అతను చెప్పిన దాని ప్రకారం… అతను వీడియో తీస్తుంటే.. లాఫో చిన్నారి తన చీలమండల దగ్గర పట్టుకుని అతడి దగ్గరికి వచ్చింది. ఆ వీడియో రికార్డ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో న్యూవెల్ క్రచెస్‌ పట్టుకుని చుట్టుపక్కల వారిని కొడతానని బెదిరింపులకు దిగింది.  ఫుటేజ్‌లో కనిపించిన దాని ప్రకారం.. ఒక సమయంలో, 20 ఏళ్ల యువతి శిశువును చాలా స్పీడ్ గా పైకి క్రిందికి ఊపుతున్నట్లు కూడా కనిపించింది. లాఫో  శిశువును తలక్రిందులుగా పట్టుకొని కాంక్రీటుపై పడేస్థానని భయపెడుతూ షేక్ చేయడం కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు. లాఫో, న్యూవెల్ 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.. సంఘటన సమయంలో ఇద్దరూ మత్తులో ఉన్నారని పోలీసుల నివేదిక పేర్కొంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, శిశువు వెనుక భాగంలో ఎర్రటి గాయాలయ్యాయి. శిశువును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్-రేలో శిశువు చేయి విరిగినట్లు సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత చిన్నారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. అయితే, ఆ శిశువు ఈ ఇద్దరు మహిళలు ఏమవుతారు. వారిమధ్య సంబంధం ఏంటి అనే విషయం వెల్లడించలేదు. ఇద్దరు మహిళలను ఎలాంటి బాండ్ లేకుండా నిర్బంధిస్తున్నామని పోలీసులు తెలిపారు.  

 • రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన‌ ‘శాంతినికేతన్’ కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు
  on September 19, 2023 at 7:27 am

  UNESCO’s World Heritage status on Santiniketan: దేశంలో అత్యంత ప్రాచుర్యం, ప్రాముఖ్య‌త కలిగిన , పశ్చిమబెంగాల్ లోని ప్రముఖ ప్రదేశం శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు లభించింది. మత, ప్రాంతీయ సరిహద్దులకు అతీతమైన విద్యాక్షేత్రం అనే ప్ర‌సిద్ద కవి దార్శనికతను ప్రతిబింబించే రవీంద్రనాథ్ ఠాగూర్ “శాంతి నివాసం” శాంతినికేతన్ ఆదివారం అధికారికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపును సాధించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు సాధించిన భార‌త్ లోని 41వ ప్ర‌దేశం కాగా, బెంగాల్ లో ఇది ఐద‌వ‌ది.  పశ్చిమబెంగాల్ లోని బుర్భూమ్ జిల్లాలో రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సౌదీ అరేబియాలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 45వ సమావేశంలో శాంతినికేతన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్యసమితి సంస్థ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ ద్వారా తెలియజేసింది. భారత రాయబారి, యునెస్కోలో శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ చేసిన పోస్టుకు జైశంకర్ స్పందిస్తూ.. ‘అభినందనలు. మన తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కు, ఆయన సందేశాన్ని సజీవంగా ఉంచిన వారందరికీ తగిన నివాళిగా’ పేర్కొన్నారు. 🔴BREAKING! New inscription on the @UNESCO #WorldHeritage List: Santiniketan, #India 🇮🇳. Congratulations! 👏👏 ➡️ https://t.co/69Xvi4BtYv #45WHC pic.twitter.com/6RAVmNGXXq — UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) September 17, 2023 అంతకు ముందు విశాల్ వి శర్మ తన సోషల్ మీడియా ‘ఎక్స్’లో శాంతినికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించ‌డంతో భారతీయులకు ఇది గొప్ప రోజు.. భార‌త్ మాతాకీ జై అంటూ పేర్కొన్నారు. శాంతినికేతన్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు ప్రకటించిన ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ ను చేర్చడం భారతీయులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దార్శనికత, భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపం అయిన శాంతినికేతన్ @UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారతీయులందరికీ ఇది గర్వకారణమన్నారు. একথা জেনে আনন্দিত হলাম যে, গুরুদেব রবীন্দ্রনাথ ঠাকুরের স্বপ্ন ও ভারতের সমৃদ্ধ সাংস্কৃতিক ঐতিহ্যের মূর্ত রূপ শান্তিনিকেতন উৎকীর্ণ হয়েছে @UNESCO বিশ্ব পরম্পরা তালিকায়। সব ভারতীয়ের কাছেই এ এক গর্বের মুহূর্ত। https://t.co/Um0UUACsnk — Narendra Modi (@narendramodi) September 17, 2023 1901 లో ఠాగూర్ చేత స్థాపించబడిన శాంతినికేతన్ ఒక రెసిడెన్షియల్ పాఠశాల. పురాతన భారతీయ సంప్రదాయాలపై ఆధారపడిన కళా కేంద్రం. మత-సాంస్కృతిక సరిహద్దులకు అతీతంగా మానవాళి ఐక్యత దార్శనికతకు ప్ర‌తిబింబం. 1921లో శాంతినికేతన్ లో మానవాళి ఐక్యతను లేదా “విశ్వభారతి”ని గుర్తిస్తూ ఒక ‘ప్రపంచ విశ్వవిద్యాలయం’ స్థాపించబడింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న బ్రిటిష్ వలసవాద నిర్మాణ దృక్పథాలు, యూరోపియన్ ఆధునికత నుండి భిన్నంగా, శాంతినికేతన్ పాన్-ఆసియా ఆధునికత వైపు విధానాలను సూచిస్తుంది. ఈ ప్రాంతం అంతటా పురాతన, మధ్యయుగ-జానపద సంప్రదాయాలను ఆకర్షిస్తుంది. బీర్భూమ్ జిల్లాలో ఉన్న ఈ సాంస్కృతిక ప్రదేశానికి యునెస్కో గుర్తింపు కోసం భారత్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చాలని శాంతినికేతన్ ను ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకోమోస్) సిఫారసు చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.

 • బీరకాయను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
  on September 19, 2023 at 7:24 am

  ఆకుపచ్చని కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి వాటిలో ఒకటి బీరకాయ ఒకటి. బీరకాయలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది.  మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అందుకే ఆరోగ్య నిపుణులు సమతుల్య, పోషకాహారాన్ని తినాలని సలహానిస్తుంటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. వీటిలో బీరకాయ ఒకటి. బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. బీరకాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..    కంటి చూపు పెరుగుతుంది బీరకాయలో విటమిన్ ఎ  పుష్కలంగా ఉంటుంది. అందుకే బీరకాయను తింటే మీ కంటి చూపు పెరుగుతుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా రావు.  జీర్ణ ఆరోగ్యం బీరకాయలో విటమిన్ ఎతో పాటుగా ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అంతేకాదు బీరకాయలో పుష్కలంగా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. బీరకాయను తింటే మీ గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.    వెయిట్ లాస్  బీరకాయలో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.  బ్లడ్ షుగర్ డయాబెటీస్ రోగులకు కూడా బీరకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.    గుండెను ఆరోగ్యంగా  బీరకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

 • Health Tips: ఫ్యామిలీ ప్యాక్ సిక్స్ ప్యాక్ అవ్వాలంటే.. తప్పకుండా చేయవలసిన ఎక్సర్సైజులు!
  on September 19, 2023 at 7:20 am

  Health Tips: బానలాంటి పొట్టను కరిగించాలంటే చాలా కష్టపడాలి. అందుకే బాన పొట్టని తగ్గించడం కోసం, సరైన శరీర ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు అవేంటో చూద్దాం.   బాడీని కరెక్ట్ షేపులో ఉంచుకోవడం కోసం కొన్ని ఎక్సర్సైజులు సూచించారు ఫిట్నెస్ నిపుణులు అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్కేటర్లు. స్కేటర్ లంజ్స్ చెరుకుదనాన్ని పెంచుతాయి. దీనివల్ల బలంగా, ఫిట్టింగ్ తయారవుతాము. ముందుగా పాదాలని వెడల్పుగా ఉంచే నిలబడండి.    ఇప్పుడు మీ ఎడమ కాలనీ కుడివైపుకి తీసుకురండి. మీ కుడి మోకాలు దాదాపు నేలను తాకే వరకు లంజ్ లోకి క్రిందికి వంచండి. ఆ తర్వాత యధా స్థానానికి వచ్చి మళ్లీ మరో కాలితో అలా చేయండి. అలాగే కార్డియో వాస్కులర్, ఏరోబిక్స్ కూడా శరీరాన్ని చక్కని షేపులో ఉంచడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.  రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్డియో వ్యాయామాలు. ఈ వ్యాయామాలు హృదయ స్పందన రేటుని పెంచడమే కాకుండా మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది. బొడ్డు చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడానికి జుంబా డాన్స్ కూడా ఎంతో మంచిది. డాన్స్ తో కూడిన ప్రసిద్ధ ఆరోబిక్ వ్యాయామం ఇది.   శరీరం అంతా కొవ్వు కరిగించటానికి వీలు కల్పించే నృత్య విధానాలను కలిగి ఉంటుంది. జుంబా డాన్స్ చేయడం వలన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్న ఫీలింగ్ రాదు. ఆనందంగా డాన్స్ చేస్తూ బరువు తగ్గవచ్చు. గ్రూప్ తో కలిసి చేయడం వలన మరింత సరదాగా ఉంటుంది.    అలాగే సెటిల్ బెల్స్ వింగ్స్ కూడా మంచి వ్యాయామము. మీ కాళ్ళ మధ్య సెటిల్ బెల్ ఉంచి నిలబడండి, సెటిల్ బెల్ ను అందుకోవడానికి మీ మోకాళ్ళను ఉంచండి. మీ నడుము నుంచి వెళ్లటం వల్ల వీపుపై ఒత్తిడి పడుతుంది. మీ కాళ్ళ మధ్య స్వింగ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ శరీరాన్ని చక్కగా టోన్ చేస్తుంది.    వీటితోపాటు రష్యన్ ట్విస్ట్ లు, లెగ్ లిఫ్టులు, ప్లాంక్, క్రంచెస్, సిట్అప్ మొదలైనవి బెల్లీ ఫ్యాట్ ని బాగా తగ్గిస్తాయి. కానీ ఇందులో ఉండే  ఎక్సర్సైజులు బాగా అవగాహన చేసుకుని అప్పుడు ఏంటి అంతేకానీ  అవగాహన లేకుండా ఈ ఎక్సర్సైజ్ లు అస్సలు చేయకండి.

 • చారిత్రాత్మక ఘట్టాలకు సజీవ సాక్ష్యం: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే
  on September 19, 2023 at 7:20 am

  న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనం అనేక  చారిత్రాత్మక ఘట్టాలకు  సాక్ష్యంగా నిలిచిందని  రాజ్యసభలో  విపక్ష నేత  మల్లికార్జున ఖర్గే చెప్పారు. భారత పార్లమెంటరీ వారసత్వంపై ప్రత్యేక  కార్యక్రమం నిర్వహించారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మంగళవారంనాడు కార్యక్రమంలో  రాజ్యసభలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు.  భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు  సేవలను  కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేసుకున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నెహ్రు ట్రిస్ట్ విత్ డెస్టినీ  ప్రసంగాన్ని ప్రస్తావించినందరుకు  ప్రధానికి ఖర్గే ధన్యావాదాలు తెలిపారు.  పాత పార్లమెంట్ లోని సెంట్రల్ హల్ కు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉందని  ఖర్గే చెప్పారు. రాజ్యాంగ సభ ఈ హాల్ లోనే మన రాజ్యాంగాన్ని రూపొందించిన విషయాన్ని  మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. అంతకుముందు పార్లమెంట్  పాత భవనం వద్ద ఎంపీల ఫోటో సెషన్ జరిగింది.ఈ సెషన్ లో  ప్రధాని మోడీతో పాటు పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమం తర్వాత  సెంట్రల్ హాల్ లో సమావేశం ప్రారంభమైంది.  పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో  ఎంపీలతో  ప్రధాని మోడీ నవ్వుతూ  పలకరించారు.  ఇవాళ మధ్యాహ్నం పార్లమెంట్ కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ ఇవాళ నిర్వహించిన సమావేశం చివరిది.  ఖర్గే ప్రసంగం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.    

 • భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?
  on September 19, 2023 at 7:14 am

  న్యూఢిల్లీ: ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య తాజా వివాదానికి కేంద్రబిందువుగా మారింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ.. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉన్నదా అనే ఆరోపణలపై కెనడా సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆయన ఆరోపణలను ఖండించింది. ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని పేర్కొంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తు ప్రారంభించగానే కెనడాలోని భారత రాయబారిని బహిష్కరిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. దీంతో భారత ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది. మన దేశం నుంచి కెనడా రాయబారి ఐదు రోజుల్లోగా వెళ్లిపోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  Also Read: భారత్ – కెనడాల మధ్య ముదురుతున్న దౌత్య యుద్ధం.. ఈ వివాదంపై అమెరికా స్పందించింది. ఆ దేశం కెనడా వైపు మొగ్గుచూపినట్టుగా తెలుస్తున్నది. వైట్ హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ స్పందిస్తూ.. కెనడా ప్రధానమంత్రి ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలు తమలో తీవ్ర ఆందోళనలను కలుగజేశాయని వివరించింది. కెనడా భాగస్వాములతో తాము నిత్యం అనుసంధానంలో ఉంటామని తెలిపింది. కెనడా దర్యాప్తు చేయడం అత్యవసరం అని పేర్కొంది. న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు వివరించింది.

 • ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
  on September 19, 2023 at 7:14 am

  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తనపై నమోదైన మరో కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఐడీ అధికారులు చంద్రబాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు  దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు నేటికి(సెప్టెంబర్ 19)కి వాయిదా వేసింది.  ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు  వెల్లడించింది.  ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ,  నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు ఇతరులను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్), సీడ్ క్యాపిటల్‌ల అలైన్‌మెంట్‌లను ఉద్దేశపూర్వకంగా, గణించిన పద్ధతిలో నారాయణ గ్రూప్ సంస్థలకు అనవసరమైన సంపదను అందించేందుకు చంద్రబాబు నాయుడు, నారాయణ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.   

 • Beauty Tips: చుండ్రుతో బాధపడుతున్నారా.. అయితే గ్లిజరిన్ మంచి ఔషధం, వాడి చూడండి!
  on September 19, 2023 at 7:09 am

   Beauty Tips: ఈ రోజులలో కాలుష్యం వల్ల జుట్టు రాలిపోవడం, తలలో చుండ్రు అనేది దాదాపు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న సమస్య. అయితే దీనికి గ్లిజరిన్ మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.    గ్లిజరిన్ అనేది కూరగాయల నూనె లేదా జంతువుల కొవ్వు నుంచి సేకరించిన సహజ ద్రవం. ఇది స్పష్టంగా, వాసన లేనిది మరియు దట్టమైన అనుగుణ్యతను కలిగి ఉంటుంది. ఇది చుండ్రుని వదిలించడానికి సహజమైన ఔషధం లాగా పనిచేస్తుంది. అసలు చుండ్రు  ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం.  చుండ్రు మలాసెజియా గ్లోబోసా అనే సహజ సిద్ధమైన ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ వాతావరణ హెచ్చుతగుల వల్ల లేదంటే తలపై నూనె ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల వస్తుంది. ఈ చుండ్రు వలన తల విపరీతమైన దురదకి గురి అవుతుంది. అలాగే జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం చుండ్రు.   అలాంటి చుండ్రుకి గ్లిజరిన్ తో ఎలా చెక్ పెట్టాలో చూద్దాం.చుండ్రు తగ్గటానికి గ్లిజరిన్ మరియు గుడ్డు హెయిర్ మాస్క్ పెట్టడం మంచి రెమెడీ. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అలాగే ఒక గుడ్డు తీసుకొని బాగా కలపండి.    దానిని హెయిర్ బ్రష్ తో సమానంగా జుట్టుపై అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూ మరియు కండీషనర్ తో మీ జుత్తుని బాగా కడగండి. అలాగే తేనె మరియు గ్లిజరిన్  సమానంగా తీసుకుని తలకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో స్నానం చేయండి ఇది మీకు మృదువైన జుట్టుని ఇస్తుంది.  అలాగే ఆముదము మరియు గ్లిజరిన్ యొక్క మిశ్రమంతో పెట్టుకునే హెయిర్ మాస్క్ కూడా మీ జుట్టు ని మృదువుగా మరియు తేమగా ఉంచుతుంది. ఇందుకోసం గ్లిజరిన్ అలాగే ఆముదము చెరో ఐదు టేబుల్ స్పూన్లు తీసుకొని బాగా కలపాలి. జుట్టు మొత్తం దీన్ని అప్లై చేయాలి.  20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టుని కడగాలి. ఇలా తరచుగా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాదు జుట్టు కూడా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే గ్లిజరిన్ ఆధారిత స్ప్రే  రోజూ ఉపయోగించటం వల్ల జుట్టు చివర్లు  చీలిపోవటాన్ని నివారించవచ్చు.

 • రాజమౌళి బంధువు అయినా పాత్ర ఇవ్వడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ కి కాల్ చేస్తే! 
  on September 19, 2023 at 7:06 am

  ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడైన జగపతిబాబు హీరోగా పరిశ్రమలో అడుగు పెట్టారు. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆయన విజయాలు, ఒడిదుడుకులు చూశారు. జగపతిబాబు చాలా ఓపెన్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, మంచి చెడులు పంచుకోవడానికి సంకోచించరు. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు అనేక విషయాలపై స్పందించారు. ప్రభాస్, రాజమౌళిలను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.  రాజమౌళి కుటుంబం ఎన్ని అవార్డులు పొందినా గర్వం ఉండదు. వాళ్ళ కుటుంబంలో అందరూ అంతే. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. రాజమౌళి నా బంధువు అయినా నేను పాత్రలు అడగను. ఆయన కూడా ఇవ్వరు. ఏ పాత్రకు ఎవరు సరిపోతారో వారినే తీసుకుంటారు. సినిమా విషయంలో అంత ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ నుండి 20 శాతం నేర్చుకున్నా చాలు అన్నారు. ఇంత వరకు రాజమౌళి సినిమాలో జగపతిబాబు నటించలేదు.  బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ కి కాల్ చేశాను. ఆయన అప్పుడు ఇండియాలో లేరు. జార్జియా నుండి నాతో ఫోన్లో మాట్లాడాడు. డార్లింగ్ నీ సమస్య ఏదైనా నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. ఇండియా వచ్చాక నన్ను కలిశాడు. ప్రభాస్ ఓదార్పు నాకు ఎంతో మేలు చేసింది. వయసులో చిన్నవాడైనా గొప్ప మనసు కలిగినవాడు. ప్రభాస్ కి ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం తెలియదు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తాడు… అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.   

 • అటు కౌంటీల్లో ఆడే అవకాశం మిస్, ఇటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కూడా! సంజూ శాంసన్‌కి వింత అనుభవం…
  on September 19, 2023 at 6:56 am

  అదృష్టానికి ఆమడ దూరంలో నిలబడే ప్లేయర్లలో సంజూ శాంసన్ ఒకడు. 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి, ఫ్యూచర్ స్టార్ అవుతాడని అందరి ప్రశంసలు దక్కించుకున్న సంజూ… 8 ఏళ్ల తర్వాత కూడా టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాడు…   కెరీర్ ఆరంభంలో ఎమ్మెస్ ధోనీ కారణంగా వైట్ బాల్ క్రికెట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, ఆ తర్వాత రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ కారణంగా తుది జట్టులోకి రాలేకపోతున్నాడు.. వచ్చిన అరకోర అవకాశాలను వాడుకున్నా, సంజూని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం టీమిండియాకి ఉన్నట్టు కనిపించడం లేదు.. వాస్తవానికి సంజూ శాంసన్‌కి కౌంటీల్లో ఆడే అవకాశం దక్కింది. త్వరలో కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ ఖాయమవుతుందనగా ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు సంజూ శాంసన్. దీంతో కౌంటీల్లో ఆడాలనే ఆలోచనను విరమించుకున్నాడు.. కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, సూపర్ 4 మ్యాచ్‌ల కోసం శ్రీలంకకు రావడంతో సంజూ శాంసన్, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. కెఎల్ రాహుల్ కోలుకోకపోతే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా సంజూని ఆడించాలని అనుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఈ కారణంగానే చైనాలో జరగాల్సిన ఆసియా క్రీడలకు కూడా సంజూ శాంసన్‌ని ఎంపిక చేయలేదు. కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం, ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్‌లో కుదురుకుపోవడం సంజూ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కూడా సంజూ శాంసన్‌కి చోటు దక్కలేదు. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి వరుసగా అవకాశాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, సంజూని పట్టించుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. గత 8 వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్  4 సార్లు డకౌట్ అయ్యాడు. మిగిలిన మ్యాచుల్లో 35+ పరుగుల మార్కు కూడా దాటలేకపోయాడు. అయినా టీ20ల్లో నెం.1 బ్యాటర్ కావడం వల్లే సూర్యకుమార్ యాదవ్‌ని ఏకంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది టీమిండియా… మరోవైపు సంజూ శాంసన్ ఈ ఏడాది ఆడినగత 8 వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలతో 43*, 15, 86*, 30, 2*, 36, 9, 51 పరుగులు చేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్… సంజూని ఫ్యూచర్ ప్లాన్స్‌లో భాగం చేయడం లేదు.. ‘సంజూ శాంసన్ ప్లేస్‌లో నేను ఉంటే, కచ్ఛితంగా చాలా నిరుత్సాహపడేవాడిని… వన్డేల్లో బాగా ఆడుతున్నా కూడా అతన్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్…  

 • ప్రకృతి సౌందర్యాన్ని రక్షించడానికి యాక్ట‌ర్ అమిత్ సాద్ దేశ‌వ్యాప్త‌ బైక్ యాత్ర‌..
  on September 19, 2023 at 6:55 am

  Amit Sadh-nature’s beauty: ‘సుల్తాన్’, ‘జీత్ కీ జిద్’, ‘అవ్రోధ్’, ‘బ్రీత్’ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన నటుడు అమిత్ సాద్ ప్రస్తుతం నెల రోజుల పాటు భారతదేశంలో మోటార్ సైకిల్ ట్రిప్ లో ఉన్నారు. ఇది అత‌ని సాహస యాత్ర మాత్ర‌మే కాదు.. ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణకు త‌న‌వంతుగా కృషి చేస్తూ అనేక మంది ప‌ర్యాట‌కుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.  ప్రస్తుతం నెల రోజుల పాటు భారత్ లో మోటార్ సైకిల్ యాత్ర చేస్తున్న నటుడు అమిత్ సాధ్ ప్రకృతి అందాలను పరిరక్షించేందుకు పర్యాటకులను ప్రేరేపిస్తున్నారు. ఇది అతనికి సాహసం మాత్రమే కాదు. ప్రకృతి అందాలను పరిరక్షించడానికి కూడా ఆయన ఎంతో నిబద్ధతతో ఉన్నారు. త‌న ప్రయాణంలో బాలాసినోర్, అహ్మదాబాద్, జోధ్ పూర్, జైపూర్, ఢిల్లీ, చండీగఢ్, థియోగ్, సంగ్లా, కాజా, జిస్పా, పూర్ణే, పాదుమ్, కార్గిల్, లేహ్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించారు. తన ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రదేశాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ప్రయాణికులందరికీ మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. అమిత్ నిజంగా తన దేశాన్ని ప్రేమిస్తారు. పర్యావరణం గురించి చాలా ఆందోళన చెందుతారు. అందుకే  దానికి హాని జరగడం తనకు ఇష్టం లేదనీ, తన ప్రయాణంలో ఒక అద్భుతమైన స్టాప్ రచ్చమ్ లో జరిగిందని తెలిపారు. త‌న విరామ స‌మ‌యం తీసుకుని అక్క‌డ పర్యాటకులు వదిలివెళ్లిన చెత్తను సేకరించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి అమిత్ స్వచ్ఛందంగా చొరవ తీసుకున్నాడు. మన పరిసరాల పరిశుభ్రతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రయాణికుడికి ఉందనీ, పర్యావరణంపై మన ప్రభావాన్ని తగ్గించాలనే ప్రగాఢ నమ్మకాన్ని ఆయన చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. అమిత్ సాధ్ తన అద్భుతమైన ప్రయాణం ముగింపుకు చేరుకున్నప్పుడు, అతను ప్రకృతి, భారతదేశం పట్ల తన ప్రేమతో ఇతరులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. త‌న భవిష్యత్తు ప్రణాళికలలో హాన్లే, సోన్మార్గ్, జమ్మూ  ప్రాంతాల్లో ప్ర‌యాణం, అక్క‌డి ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఉన్నాయి. అమిత్ త‌న అద్బుత‌మైన, సాహ‌సోపేత‌మైన ప్ర‌యాణం గురించి వివ‌రిస్తూ.. “నేను రోడ్డుపైకి వచ్చినప్పుడల్లా, రైడింగ్ నిజంగా నాకు ఆత్మ మేల్కొలుపు అనుభవంగా మారుతుంది. మన దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన ప్రజలను కలుసుకోవడం, రుచికరమైన స్థానిక వంటకాలను ఆస్వాదించడం, వారి విభిన్న సంస్కృతులలో మునిగిపోవడం, మన దేశ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం నాకు చాలా ఆనందంగా ఉందని” తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఈ ప్ర‌కృతి కాపాడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని తెలిపారు. (ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)