May 9, 2024

Telugu

  • IPL 2024 : సిక్స‌ర్ల మోత మోగించారు.. చ‌రిత్ర సృష్టించారు !
    on May 8, 2024 at 7:14 pm

    Tata IPL 2024, IPL Sixers Record : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 57వ  మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనను ప్రదర్శించింది. హైద‌రాబాద్ బౌల‌ర్లు రాణించ‌డంతో ప‌రుగులు చేయ‌డానికి అనుకూలంగా ఉండే పిచ్ పై పెద్ద హిట్టర్లతో కూడిన ల‌క్నో జ‌ట్లు కేవలం పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల‌తో త‌న ఇన్నింగ్స్ ను ముగించింది. అయితే, చివ‌ర‌లో ఆయుష్ బదోని, నికోలస్ పూరన్‌ల పోరాటంతో లక్నో సూప‌ర్ జెయింట్స్ పోటీనిచ్చే స్కోరును న‌మోదుచేసింది. 20 ఓవ‌ర్ల‌లో 165/4  ప‌రుగులు చేసింది. అయితే, కేఎల్ రాహుల్, క్రునాల్ పాండ్యా కూడా ప్రారంభ దశలో కీలకమైన పరుగులను అందించారు.  ఈ క్ర‌మంలోనే ఈ ఐపీఎల్ సీజ‌న్ లో 1000వ సిక్స‌ర్ ను న‌మోదుచేశారు. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్ట‌డంతో  ఐపీఎల్ 2024 లో 1,000వ సిక్సర్ ను న‌మోదుచేశాడు. సీఎస్కేను వెన‌క్కి నెట్టిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ దెబ్బ‌కు ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్ మొత్తం ఈ సీజ‌న్ లో ప్లేయ‌ర్లు కేవ‌లం 13,079 బంతుల్లోనే 1000 సిక్స‌ర్లు బాదారు. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ సీజ‌న్ల‌లో అతిత‌క్కువ బంతుల్లో ప్లేయ‌ర్లు 1000 సిక్స‌ర్లు బాదిన సీజ‌న్ ఇదే కావ‌డం విశేషం. అంత‌కుముందు 1000 సిక్స‌ర్ల మార్కును చేరుకునేందుకు 2023లో 15,390 బంతులు అవ‌స‌రం అయ్యాయి.  ఐపీఎల్ చ‌రిత్ర‌లో 1,000 సిక్స‌ర్ల‌కు త‌క్కువ బంతుల సీజ‌న్లు టాప్-3  ఐపీఎల్ 2024లో 13,079 బంతులు ఐపీఎల్ 2023లో 15,390 బంతులు ఐపీఎల్ 2022లో 16,269 బంతులు మాట‌లు రావ‌డం లేదు.. స‌న్ రైజ‌ర్స్ విధ్వంసంతో బిత్త‌ర‌పోయిన కేఎల్ రాహుల్

  • సీఎస్కేను వెన‌క్కి నెట్టిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ దెబ్బ‌కు ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్
    on May 8, 2024 at 6:49 pm

    IPL 2024 Points Table: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 57వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన హైదరాబాద్ జ‌ట్టు మరో చిరస్మరణీయ విజ‌యాన్ని అందుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉంచిన 166 ప‌రుగుల టార్గెట్ ను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు దుమ్మురేపే బ్యాటింగ్ తో హైద‌రాబాద్ జ‌ట్టు కేవ‌లం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. హైదరాబాద్ ఓపెనర్లు ఆరంభం నుంచి లక్నో బౌలర్లపై విరుచుకుప‌డ్డారు. ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ ల‌క్నో బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నారు. దీంతో హైద‌రాబాద్ జ‌ట్టు ల‌క్నో పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఈ విజ‌యంలో హైద‌రాబాద్ జ‌ట్టు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ను వెనక్కి నెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్ ల‌ను ఆడిన హైద‌రాబాద్ జ‌ట్టు 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-3 లో కొన‌సాగుతోంది. మొద‌టి రెండు స్థానాల్లో కోల్ క‌తా,  రాజ‌స్థాన్ జ‌ట్లు ఉన్నాయి. ఈ రెండు జ‌ట్ల‌కు 16 పాయింట్లు ఉన్నాయి. కేవ‌లం ర‌న్ రేటు తేడాతోనే టాప్ ప్లేస్ మారింది. మరోవైపు హైదరాబాద్ విజయంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ అర్హత సాధించాలన్న ముంబై ఇండియన్స్ ఆశలకు తెరపడింది. ముంబై చేతిలో కేవలం ఎనిమిది పాయింట్లు, మూడు లీగ్ దశ మ్యాచ్లు మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఐపీఎల్ 2024లో టాప్ 4లో నివ‌డం అసాధ్యం. దీంతో మ‌రోసారి ముంబైకి నిరాశ త‌ప్ప‌లేదు. అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ Teams M W L D Points NRR KKR 11 8 3 0 16 1.453 RR 11 8 3 0 16 0.476 SRH 12 7 5 0 14 0.406 CSK 11 6 5 0 12 0.7  IPL 2024 : చ‌రిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..

  • IPL 2024 : చ‌రిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
    on May 8, 2024 at 6:21 pm

    SRH vs LSG : ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. లక్నో సూపర్ జెయింట్ ఉంచిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 58 బంతుల్లోనే సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్ దెబ్బ‌కు లక్నో బౌలింగ్ చిత్తైంది. ఈ మ్యాచ్ లో ముందుగా కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ల‌క్నో జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. 166 ప‌రుగుల‌తో ఛేజింగ్ కు దిగిన‌ సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (89 ప‌రుగులు), అభిషేక్ శ‌ర్మ (75 ప‌రుగులు)లు సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు. ఊచ‌కోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు   A stylish strike to end a stylish chase! Simply special from the #SRH openers 🤝 Recap the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvLSG pic.twitter.com/2xUlOlS1kk — IndianPremierLeague (@IPL) May 8, 2024   10 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై అద్భుత విజ‌యాన్ని అందుకున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో మ‌రో రికార్డును న‌మోదుచేసింది. హైద‌రాబాద్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌ల సునామీ ఇన్నింగ్స్ తో హైద‌రాబాద్ జ‌ట్టు 9.4 ఓవ‌ర్ల‌లోనే వికెట్ న‌ష్ట‌పోకుండా 166 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించింది. దీంతో ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్యంత వేగంగా 160+ ప‌రుగులు టార్గెన్ ను అందుకున్న జ‌ట్టుగా హైద‌రాబాద్ రికార్డు సృష్టించింది. అలాగే, 10 ఓవ‌ర్ల‌లోనే అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘ‌నత సాధించింది. ఆ త‌ర్వాతి రెండు స్థానాల్లో కూడా 158, 148 ప‌రుగుల‌తో హైద‌రాబాద్ జ‌ట్టు ఉంది.  ఐపీఎల్ లో మొదటి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు:  167/0 (9.4) హైద‌రాబాద్ vs ల‌క్నో,  హైదరాబాద్ 2024 * 158/4 హైద‌రాబాద్ vs ఢిల్లీ, ఢిల్లీ 2024 148/2 హైద‌రాబాద్ vs ముంబై, హైదరాబాద్ 2024 141/2 ముంబై vs హైద‌రాబాద్, హైదరాబాద్ 2024 మాట‌లు రావ‌డం లేదు.. స‌న్ రైజ‌ర్స్ విధ్వంసంతో బిత్త‌ర‌పోయిన కేఎల్ రాహుల్

  • మాట‌లు రావ‌డం లేదు.. స‌న్ రైజ‌ర్స్ విధ్వంసంతో బిత్త‌ర‌పోయిన కేఎల్ రాహుల్
    on May 8, 2024 at 5:53 pm

    SRH vs LSG : ఎవ‌రు కొడితే దిమ్మ‌దిరిగి పోతుందో వారే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. హైద‌రాబాద్ అంత‌టా వ‌ర్షం ప‌డిడే స‌న్ రైజ‌ర్స్ ఓపెన‌ర్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సునామీ సృష్టించాడు. బౌండ‌రీల వ‌ర్షంతో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. హైద‌రాబాద్ దెబ్బ‌కు ల‌క్నో అబ్బ అన‌క త‌ప్ప‌లేదు. హైద‌రాబాద్ ఓపెనింగ్ బ్యాటింగ్ చూసిన కేఎల్ రాహుల్ కు సైతం దిమ్మ‌దిరిగిపోయి ఏం మాట్లాడాలో తెలియ‌లేదు. అలా ఊచ‌కోత చూపించారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మ‌రో రికార్డు విజ‌యాన్ని అందుకుంది హైద‌రాబాద్. ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – లక్నో సూపర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి. లక్నో సూపర్ జెయింట్ ఉంచిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 58 బంతుల్లోనే సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్ దెబ్బ‌కు లక్నో బౌలర్లు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకున్నారు. కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డంతో ల‌క్నో జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో అద్భుత విజ‌యాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (89 ప‌రుగులు), అభిషేక్ శ‌ర్మ (75 ప‌రుగులు)లు సునామీ ఇన్నింగ్స్ మ‌రోసారి దుమ్మురేపారు. హైద‌రాబాద్ బ్యాటింగ్ దెబ్బ‌కు కేఎల్ రాహుల్ దిమ్మ‌దిరిగిపోయింది. ఊచ‌కోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు.. మ్యాచ్ అనంతరం ల‌క్నో ఓటమిపై కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా.. తనకు మాటలు రావడం లేదని చెప్పాడు. త‌మ జ‌ట్టు 240 పరుగులు చేసినా ఓడిపోయేదని పేర్కొన్నాడు. ఇలాంటి ఈ రకమైన బ్యాటింగ్‌ను టీవీలో చూశాం.. ఇప్పుడు వాస్త‌వంగా చూశామ‌ని చెప్పాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టిన హైద‌రాబ్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌ల‌పై ప్ర‌శంస‌లు కూడా కురిపించాడు. ట్రావిస్ హెడ్ ను ఆప‌డం కష్టంగా మారింద‌ని చెప్పాడు. అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి అద్భుత బ్యాటింగ్ చేశాడ‌ని తెలిపాడు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 296.67. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అభిషేక్ 267.86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.   KL Rahul said, “I’m lost for words, this is unreal batting”. pic.twitter.com/ohcyep6cOt — Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2024   అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ 

  • అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ
    on May 8, 2024 at 5:26 pm

    Sanju Samson who fought with the umpire :  టీమిండియా యంగ్ ప్లేయ‌ర్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ అండ్ కెప్టెన్ సంజూ శాంస‌న్ కు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత అంపైర్ తో గొడ‌వ‌కు దిగ‌డంతో శాంసన్‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ముఖేష్ కుమార్ వేసిన బంతిని సంజు శాంసన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బౌండరీ వద్ద నిలబడిన షాయ్ హోప్ బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి మైదానంలో కలకలం రేగింది. సంజూ శాంసన్ సహచరులు అతను నాటౌట్ అని నమ్మారు కానీ, థర్డ్ అంపైర్ అతన్ని ఔట్ ఇచ్చాడు. శాంసన్‌కు బీసీసీఐ షాక్..  ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పదమైన అవుట్ తర్వాత మైదానంలో అంపైర్‌లతో తీవ్ర వాగ్వాదం చేసినందుకు సంజూ శాంసన్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించింది బీసీసీఐ. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 56లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక ప్రకటన తెలిపింది. శాంసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. అతను దీనిని అంగీకరించాడనీ, అలాగే, మ్యాచ్ రిఫరీ నిర్ణ‌యాన్ని అంగీక‌రించాడ‌ని తెలిపింది. సూర్య సునామీ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య రికార్డులు బ్రేక్ శాంస‌న్ ఔట్ లో ఏం జరిగింది? రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో, ముఖేష్ కుమార్ 16వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవ‌ర్ 4వ బంతికి, సంజు శాంసన్ లాంగ్-ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు, అయితే బౌండరీ వద్ద నిలబడి ఉన్న షాయ్ హోప్ బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. పలు కెమెరా కోణాల్లో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ సంజూ శాంసన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే, హోప్ పాదం బౌండరీ లైన్‌కు చాలా దగ్గరగా ఉందని సైడ్ యాంగిల్ వెల్లడించింది. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ శిబిరంలోని అందరూ ఫీల్డర్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు విశ్వసించారు. అయితే టీవీ అంపైర్ సంజూ శాంసన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత శాంసన్ మైదానంలోని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే, చివరికి అతను పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. శాంసన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో అంపైరింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 46 బంతుల్లో 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడి సంజూ అవుటయ్యాడు. ఇది మ్యాచ్‌లో పెద్ద మలుపు తిరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్‌లో కామెంటరీ ప్యానెల్‌లో భాగమైన భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబ‌ట్టారు. సంజూ శాంసన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఊచ‌కోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు.. హైద‌రాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన ల‌క్నో

  • ఊచ‌కోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు.. హైద‌రాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన ల‌క్నో
    on May 8, 2024 at 5:14 pm

    IPL 2024, SRH vs LSG : ఊచ‌కోత అంటే ఎలా ఉంటుందో చూపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు. ల‌క్నో బౌల‌ర్ల‌పై త‌మ బ్యాటింగ్ ప్ర‌తాపాన్న చూపించారు. ట్రావిస్ హెడ్ దెబ్బ‌కు ల‌క్నో ప్లేయ‌ర్లు త‌ల ప‌ట్టుకున్నారు. అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి స్టేడియాన్ని షేక్ చేశాడు. ఇద్ద‌రు ప్లేయ‌ర్లు రికార్డు హాఫ్ సెంచ‌రీలో హైద‌రాబాద్ టీమ్ కు అద్భుత విజ‌యాన్ని అందించారు. ప‌వ‌ర్ ప్లే లో 100+ ప‌రుగులు సాధించిన ఇద్ద‌రు.. 10 ఓవ‌ర్లు ముగియ‌క ముందే 167 ప‌రుగుల సాధించి హైద‌రాబాద్ కు 10 వికెట్ల తేడా విజ‌యాన్ని అందించారు. ప్లేఆఫ్ రేసులో మ‌రింత ముందుకు తీసుకెళ్లారు. ఈ విజ‌యంతో హైద‌రాబాద్ టీమ్ పాయింట్ల ప‌ట్టిక‌లో 14 పాయింట్ల‌తో టాప్-3లోకి వ‌చ్చింది. మొద‌టి రెండు స్థానాల్లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఉన్నాయి. స్టేడియం ద‌ద్ద‌రిల్లిపోయింది.. బౌండ‌రీల వ‌ర్షం కురిసింది !  ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ ఓపెనర్ల దుమ్మురేపే బ్యాటింగ్ తో 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో క్రికెట్ ల‌వ‌ర్స్ బౌండ‌రీల వ‌ర్షం త‌డిసిపోయారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అయితే,  ఛేజింగ్ లో సన్‌రైజర్స్ హైద‌రాబాద్ 9.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా  నష్టపోకుండా 167 పరుగులు చేసి అద్భుత విజ‌యాన్ని సాధించింది. సన్‌రైజర్స్ తరఫున ట్రావిస్ హెడ్ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెడ్ త‌న‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ల‌క్నో బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. స్ట్రైక్ రేట్ 296.67తో త‌న ఇన్నింగ్స్ ను కొన‌సాగించాడు. మ‌రో ఎండ్ లో యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులతో స్టేడియాన్ని షేక్ చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అభిషేక్ 267.86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.   A stylish strike to end a stylish chase! Simply special from the #SRH openers 🤝 Recap the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvLSG pic.twitter.com/2xUlOlS1kk — IndianPremierLeague (@IPL) May 8, 2024   చివ‌ర‌లో మెరిసిన ల‌క్నో.. కానీ.. అంతకుముందు లక్నో తరఫున ఆయుష్ బడోని 30 బంతుల్లో 55 పరుగులు, నికోలస్ పురాన్ 26 బంతుల్లో 48 పరుగులు చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు, కృనాల్ పాండ్యా 21 బంతుల్లో 24 పరుగులు చేశారు. మార్కస్ స్టోయినిస్ 3 పరుగుల వద్ద అవుట్ కాగా, క్వింటన్ డి కాక్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఏ జ‌ట్లు ప్లేఆఫ్ కు చేరుకుంటాయి? ముంబై, బెంగ‌ళూరు జ‌ట్ల‌కు ఛాన్స్ ఉందా?

  • రిజర్వేషన్లకు నెహ్రూ కూడా వ్యతిరేకమే..: ఆసక్తికర కథనంతో కాంగ్రెస్ కు బిజెపి కౌంటర్
    on May 8, 2024 at 5:13 pm

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార బిజెపి, ప్రతిపక్ష బిజెపి మధ్య రిజర్వేషన్లపై మాటలయుద్దం సాగుతోంది. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని… బడుగు బలహీనవర్గాల ప్రజలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిజెపి మాత్రం తాము కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని…రాజ్యాంగం కల్సించిన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెబుతుంది. ఇలా ఇరు జాతీయ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో వాగ్వాదానికి దిగుతున్నాయి.  ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది.  భారత తొలి ప్రధాని జవహర్ లాల్ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లుగా ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ పాతకథనం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం… షెడ్యూల్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్టీ) లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి తాను వ్యతిరేకమంటూ నెహ్రూ మాట్లాడారు. ఈ రిజర్వేషన్లు వారిలో న్యూనతా భావాన్ని కల్పిస్తాయన్నది నెహ్రూ అభిప్రాయపడినట్లుగా ఈ కథనం సారాంశం.  Quote Nehru said that he was against the reservation of jobs for members of the Scheduled Castes and Scheduled Tribes because it tended to create an inferiority complex in them. Unquote Congress has always been against empowerment of SC/ST and OBCs. But PM Modi and BJP will… pic.twitter.com/Zo6C2Azyjz — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 8, 2024   అయితే రిజర్వేషన్లపై బిజెపి, కాంగ్రెస్ ల మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న వేళ ఈ కథనం ఆసక్తికరంగా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీని కాస్త ఇరకాటంలో పెట్టవచ్చు. రిజర్వేషన్లపై మాజీ ప్రధాని నెహ్రూ అభిప్రాయం ప్రస్తుతం మోదీ అభిప్రాయానికి దగ్గరగా వున్నట్లుంది. ఆయన ఎస్సి, ఎస్టీలకు రిజర్వేషన్లు వద్దని అభిప్రాయపడితే ప్రస్తుతం మోదీ మతపరమైన రిజర్వేషన్లు  వద్దంటున్నారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  తమ ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెస్తోందని బిజెపి ఆరోపిస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగం సైతం ఒప్పుకోదు… కానీ ముస్లిం ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్ దీన్ని అమలుచేస్తామని హామీలు ఇస్తోందంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వబోమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల సభల్లో బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.  ఈ క్రమంలోనే రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీన్ని తమ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోంది. కానీ ఇప్పుడు నెహ్రూ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారన్న వార్త కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేదిగా వుంది. దీన్ని బిజెపి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. ఇలా బిజెపి, కాంగ్రెస్ ల మధ్య రిజర్వేషన్ల వివాదం మరో మలుపు తిరిగింది.   

  • ప్రీతి జింటా టాలీవుడ్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
    on May 8, 2024 at 4:49 pm

    టాలీవుడ్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది బాలీవుడ్ స్టార్ సీనియర్ బ్యూటీ ప్రీతి జింటా. ఎప్పుడు..? ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందో తెలుసా..?    ప్రీతి జింటా.. గుర్తుందా.. సొట్టబుగ్గటతో కుర్రకారు మనసులు దోచేసిన బాలీవుడ్ బ్యూటీ.  తెలుగులో ఆమె చేసింది రెండే రెండు సినిమాలు అయినా.. ఆరెండింటితోనే భారీగా ఫాలోయింగ్ ను తన ఖాతాలో వేసుకుంది ప్రీతి. బోలెడంత స్టార్ డమ్ ను సాధించింది ప్రీతి జింట. ఆరెండు సినిమాలే ఇప్పటికీ ప్రీతి జింటా అంటే గుర్తుపట్టేలా చేసింది.    కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య – జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..? ఇంతకీ ప్రీతి చేసిన ఆ రెండు సినిమాలుఏంటంటే…?  తెలుగులో విక్టరీ వెంకటేష్ జోడీగా ప్రేమంటే ఇదేరా సినిమాతో పాటు.. సూపర్ స్టార్ మహేష్బాబు జోడీగా  రాజకుమారుడు సినిమాల్లో నటించింద ప్రీతి.  తన క్యూట్ స్మైల్, ఇన్నోసెంట్ ఫేస్.. బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో అందాల ప్రీతి అందరిని ఆకట్టుకుంది.    మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..? ఇక తన  నటనతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా మెప్పించిన ప్రీతి… ఆ రెండు సినిమాల తరువాత టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. బాలీవుడ్ లో మాత్రం నాన్ స్టాప్ గా సినిమాలు చేసిన ప్రీతి.. 2028 లో సినిమాలకు బ్రేక్ వేసింది. పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.   రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ హిట్ ను వదిలేసుకున్న పవర్ స్టార్..? ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్ పంజాబ్ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్ గా బిజీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. 50 ఏళ్ళు దగ్గర పడుతున్నా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది ప్రీతి జింటా.   ఎన్టీఆర్ – కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..? ఈ క్రమంలో ఓ నెటిజన్.. మీరు తెలుగు సినిమాల్లో మళ్ళీ నటిస్తారా అని అడగ్గా ప్రీతి జింటా సమాధానమిస్తూ.. నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వినిపిస్తే నేను నో చెప్పకుండా చేస్తాను అని తెలిపింది. ఇప్పుడే బాలీవుడ్ లో ఆరేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి జింటా మరి తెలుగులో కూడా స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.    కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..? ఇక తాను నటించడానికి రెడీ అని డైరెక్ట్ గా చెపుతున్న ప్రీతి సమాధానం విని.. తెలుగు మేకర్స్ ఎవరైనా.. వారి సినిమాలకోసం స్పెషల్ గా ప్రీతీని తీసుకుంటారా లేదా అనేది చూడాలి.    సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?

  • ఏ జ‌ట్లు ప్లేఆఫ్ కు చేరుకుంటాయి? ముంబై, బెంగ‌ళూరు జ‌ట్ల‌కు ఛాన్స్ ఉందా?
    on May 8, 2024 at 4:09 pm

    IPL 2024 playoffs: ఐపీఎల్ 2024 17వ సీజన్ మార్చి 22న ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు 56 లీగ్ మ్యాచ్‌లు ఆడగా, ఒక్కో జట్టు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే 12 మ్యాచ్‌లు ఆడాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌లు ఆడగా 8 విజయాలతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌గా ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా 11 మ్యాచ్‌లు ఆడగా 8 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచుల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్‌లు కూడా 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇతర జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 జెర్సీలో ఒక్క ‘స్టార్’ మాత్ర‌మే ఎందుకు ఉంది? గుజరాత్ టైటాన్స్ 2022లో ఛాంపియన్‌గా నిలిచింది, అయితే 2023లో ఫైనల్‌లో ఓడిపోయింది. ఈ రెండు సీజన్లలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం. ఈ దశలో పాయింట్ల పట్టికలో 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్న జట్లకు వరుసగా 3 శాతం, పంజాబ్ కింగ్స్ 3 శాతం, గుజరాత్ టైటాన్స్ 2 శాతం, ముంబై ఇండియన్స్ 0 శాతంతో ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంది. అందువల్ల ఈ 4 జట్లు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మ్యాజిక్ జ‌ర‌గాల్సిందే. ఈ జట్లే కాకుండా 5వ, 6వ స్థానాల్లో ఉన్న లక్నోకు ప్లేఆఫ్‌కు చేరే అవకాశం 49 శాతం ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 32 శాతం అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో ఉన్న కోల్‌కతాకు 99 శాతం, రాజస్థాన్ రాయల్స్‌కు 97 శాతం ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్‌కు 59 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 56 శాతం అవకాశాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టాప్ 4 లోని మిగ‌తా మూడు జట్లలో 2 క్వాలిఫైయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్‌లో పోటీపడతాయి. గెలుపొందిన జట్టు 2వ జట్టుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. సూర్య సునామీ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య రికార్డులు బ్రేక్

  • ఓటు వెయ్ … ఫోటో తియ్ : ఓటర్ల కోసం ఏసియా నెట్ తెలుగు ఫోటో కంటెస్ట్
    on May 8, 2024 at 4:06 pm

    మనకు సుపరిపాలన అందిస్తే దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించే నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుంది… అది మనం ఓటు వేయడంవల్లే సాధ్యం. ఓటు వేయడం మనందరి హక్కు… కాబట్టి ప్రతిఒక్కరు ఆ హక్కును వినియోగించుకోవాలి. మే 13న తెలంగాణలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఈ సందర్భంగా  మీ ఏసియా నెట్ తెలుగు ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల కోసం ఓ ఫోటో కంటెస్ట్ రన్ చేస్తున్నాం. ఇందులో పాల్గొనడం చాలా సింపుల్…  మీరు ఓటేసాక ఓ ఫోటో దిగి  https://telugu.asianetnews.com/election/photo-contest లింక్ ఓపెన్ చేసి మాకు పంపిస్తే చాలు… ఫోటోతో పాటు పేరు, మొబైల్ నెంబర్ ఓ స్లోగన్ పంపించాలి.   

  • అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?
    on May 8, 2024 at 3:38 pm

    ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలుఉన్నాయో తెలుసా..?    ఆలియా భట్.. చాలా త్వరాగా పెళ్ళి చేసుకుంది.. అప్పుడే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా సరే తన గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు ఆలియా. సినిమాలు.. మోడలింగ్, ర్యాంప్ వాక్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతే కాదు.. ప్రతీ సారి తన డ్రెస్సింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బ్యూటీ. ఆ డ్రెస్ వెనుక ఏదో ఒక ప్రత్యేకతను చాటుతోంది ఆలియా భట్.  కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య – జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..? రీసెంట్ గా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ఆలియా త్వరలో జిఘ్ర సినిమాతో రాబోతుంది బాలీవుడ్ భామ అలియా భట్.  వరుస సినిమాలతో దూసుకుపోతుంది స్టార్ బ్యూటీ. ఇక ఆమె టాలీవుడ్ ఎంట్రీ గురించి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ సినిమా ఆర్ఆర్ఆర్ తో తెలుగుపరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆలియా భట్.  కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?   బయట ఎంత బిజీగా ఉన్నా..  మరోవైపు  తన ఫ్యామిలీ లైఫ్ ను కూడా హ్యాపీగా లీడ్ చేస్తోంది ఆలియా భట్. భర్త రణబీర్ కపూర్, పాప రాహాతో ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా గడుపుతుంది. ఎప్పటికప్పుడు తమ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది.  మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?   తాజాగా అలియాభట్ న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. ఈ ఈవెంట్ కి ఫేమస్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి రకరకాల సెలబ్రిటీలు వచ్చారు. అంతే కాదు బిజినెస్ దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో అలియాభట్ వెళ్లగా తన డ్రెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సరికొత్త శారీ డిజైన్ చేసి కట్టుకెళ్లింది అలియా భట్.    ఎన్టీఆర్ – కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..? ఇక ఈ చీర ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. పొడవైన చీరను ధరించిన ఆలియా భట్.. చీరకట్టులో మెట్ గాలా రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది. అయితే ఈ ఈవెంట్లో అలియా తన డ్రెస్ గురించి మాట్లాడుతూ.. ప్రముఖ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ ఆధ్వర్యంలో 163 మంది చేతుల మీదుగా దాదాపు 1900 గంటలు పైగా కష్టపడి ఈ శారీని తయారుచేశారని తెలిపింది.  అంతే కాదు ఇంత వరకూ ఏ చీరకు ఉపయోగించనంత హెవీగా.. ఎంబ్రాయిడరీ వర్క్ తో.. అందరు ఆశ్చర్యపోయేలా..  సరికొత్తగా శారీని  తయారు చేసారని ఆమె వెల్లడించింది. ఇక ఈ శారీ లుక్ లో అలియాభట్ శారీ పిక్స్ సోసల్ మీడియాలో  వైరల్ గా మారాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ ఒక్క చీర కోసం అంత మంది పనిచేశారా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

  • ”చంద్రబాబు… ఆడబిడ్డలపైనా నీ ప్రతాపం”
    on May 8, 2024 at 2:50 pm

    అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అధికార వైసిపి ఒంటరిగానే పోటీచేస్తుంటే ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు ఈ కూటమి నిలవలేకపోతోందని వైసిపి నాయకులు అంటున్నారు. సింహంలా సింగిల్ గా వస్తున్న జగనన్నను ఏం చేయలేక టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు ప్రస్టేషన్ కు గురవుతున్నారట… అందుకోసమే మహిళలపై దాడులకు తెగబడుతున్నారని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యపై దాడి జరిగింది. భర్తకు మద్దతుగా ఇవాళ శిరిగిరిపాడులో పిన్నెల్లి రమాదేవి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కొందరు రాళ్లు, కర్రలతో రమాదేవితో పాటు వెంటవచ్చిన మరికొందరు మహిళలపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భార్యతో పాటు ఇతర మహిళలు గాయపడ్డారు. తన భర్త రామకృష్ణారెడ్డికి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని రమాదేవి అన్నారు.  ప్రస్టేషన్‌తో శాడిస్ట్‌ల్లా మారుతున్న టీడీపీ నేతలు! ఎన్నికల ప్రచారంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి భార్య రమాపై టీడీపీ గూండాలు దాడి నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా గూండాలను దాడులకి ఉసిగొల్పుతున్న టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఓటమి భయంతో… pic.twitter.com/2nj16zAQUx — YSR Congress Party (@YSRCParty) May 8, 2024   అంతకుముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోడలిపైనా ఇలాగే దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బాలినేని కోడలిపై టిడిపి శ్రేణులు నానా దుర్భాషలాడి దాడికి యత్నించారు. ఇది చంద్రబాబు చేయించిన పనేనని … తన ఫ్యామిలీని టచ్ చేస్తే చూస్తూ ఊరుకోబోనని బాలినేని హెచ్చరించారు. ఇలా ఒంగోలులో కూడా చంద్రబాబు గ్యాంగ్ మహిళలను టార్గెట్ చేసి దాడులకు తెగబడిందని వైసిపి మండిపడుతోంది.    ఇక విజయవాడలో ఇలాగే వైసిపి మహిళా కార్యకర్తలపై టిడిపి అభ్యర్థి బోండా ఉమ అనుచరులు జులుం ప్రదర్శించారు. మహిళలతో పశువుల్లా ప్రవర్తిస్తూ దాడికి తెగబడ్డారని మండిసపడుతున్నారు. అంతకుముందు ఇలాగే వైసిపి సుపరిపాలన, సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రజా సక్షేమం గురించి మాట్లాడినందుకు గీతాంజలిని వేధించి చంపిన దారుణాన్ని కూడా వైసిపి గుర్తుచేస్తోంది. ఇలా సోషల్ మీడియాలో మహిళలను వేధించే స్థాయినుండి ఇప్పుడు భౌతిక దాడులకు దిగే స్థాయికి చంద్రబాబు బ్యాచ్ దిగిజారిపోయిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ టిడిపి గూండాలు మరింత రెచ్చిపోతున్నారని… స్వయంగా రాష్ట్ర హోంమంత్రిపైనే దాడికి దిగారంటేనే ఎంతకు తెగించారో అర్థమవుతుందని వైసిపి అంటోంది. మంగళవారం అర్ధరాత్రి ప్రచారం ముగించుకుని వెళుతున్న హోంమంత్రి తానేటి వనితపై టిడిపి కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. ఇలా మహిళలపై కావాలనే టిడిపి శ్రేణులు దాడులు చేస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే పసుపు బ్యాచ్  మహిళలను టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఈ దాడులే మహిళలపై టిడిపికి, చంద్రబాబుకు ఎంత గౌరవం వుందో తెలియజేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు బ్యాచ్ అరాచకాలను మహిళా లోకం గమనిస్తోంది… ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని వైసిపి హెచ్చరిస్తోంది.   

  • ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్, బన్నీ, చరణ్… మీ అభిమాన హీరోల ఇష్టమైన ఫుడ్స్ ఇవే!
    on May 8, 2024 at 1:59 pm

    స్టార్స్ అంటే జనాల్లో ఉండే క్రేజ్ వేరు. వారికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి అనుకుంటారు. మరి టాలీవుడ్ టాప్ హీరోల ఇష్టమైన వంటకాలు ఏమిటో తెలుసా…    హీరోల మీద ఉండే అభిమానానికి హద్దులు లేవు. ప్రతి విషయంలో వాళ్ళను ఫాలో అయిపోతారు. తమ అభిమాన హీరోల ఇష్టాలు, వ్యాపకాలు, జీవన విధానం తెలుసుకోవాలని కోరుకుంటారు. అభిమానులను ఆకర్షించే అంశాలలో ఇష్టమైన ఫుడ్స్ కూడా ఒకటి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇష్టపడే వంటకాలు ఏమిటో మీరే చూడండి…  ప్రభాస్ భోజన ప్రియుడు. ఎక్కువగా నాన్ వెజ్ తింటారట. తనతో నటించే హీరోయిన్ కి పలు వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కి ఉన్న సాంప్రదాయం. ఇక ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ మాత్రం రొయ్యల పులావ్.  ఎన్టీఆర్ కూడా నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడతారట. తనకు చేపల పులుసు అంటే ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు.  అందాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు మహేష్ బాబు. కానీ చీటింగ్ డే నాడు తనకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తారు. మహేష్ బాబుకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహా ఇష్టం అట.    హీరో అల్లు అర్జున్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్. కెరీర్ బిగినింగ్ లోనే సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. అల్లు అర్జున్ కి ఇష్టమైన వంటకం బిర్యానీ. రామ్ చరణ్ బాడీ చూస్తే అమ్మాయిలు మాయలో పడిపోతారు. దాని కోసం ఆయన ప్రత్యేకమైన డైట్ తీసుకుని వ్యాయామం చేస్తారు. ఇక రామ్ చరణ్ కి ఇష్టమైన గుడ్ బాదం మిల్క్.    నట సింహం బాలయ్య కూడా ఆహార ప్రియుడే. ఆయనకు చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు అంటే బాగా ఇష్టం. ఇక మెగాస్టార్ చిరంజీవి సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట. చేపలు, రొయ్యలు, పీతలు అంటే ఆయనకు ఇష్టమని సమాచారం.    60 ఏళ్ల వయసు దాటినా యంగ్ గా కనిపిస్తున్నాడు కింగ్ నాగార్జున. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవన శైలి దీనికి కారణం. నాగార్జన ఫేవరేట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ.    హీరో వెంకటేష్ కి నాటు కోడి, పులావ్ అంటే అమిత ఇష్టం అట. తరచుగా నాటు కోడి కూరతో భోజనం చేస్తారట. రానాకి కూడా నాటుకోడి కూర అంటే ఇష్టం అట.   

  • సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?
    on May 8, 2024 at 1:58 pm

    బాలీవుడ్ లోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  అంటే వెంటనే వినిపించే పేరు సల్మాన్ ఖాన్. ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదో ఎవరీకీ తెలియదు.. కాని తన లైఫ్ లో ఓ ప్రేమ లేఖ మాత్రం ఉంది.  ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లేక ఇంతకీ ఆయన  ఎవరికి రాశారు..?    బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్  చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమా వాళ్లల్లో సల్మాన్ ఖాన్ తప్పించి ఎవరూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. . కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు.   అంతే కాదు బాలీవుడ్ లో సల్మాన్ తో ఎంతో మంది హీరోయికు ఏఫైర్స్ నడిచాయి అన్నది అందరికి తెలిసిన నిజం.  స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి తారలతో నటించినా.. ఎవరినీ పెళ్లాడలేదు సల్మాన్. అయితే సల్మాన్ ఖాన్ జీవితంలో మాత్రం ఓ ప్రేమ లేఖ ఉందట. అదికూడా చాలా  ఘాటుగా..మనసు పెట్టిరాశాడట. ఇంతకీ అది ఆయన ఎవరికి రాశారు.    కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?   బాలీవుడ్ మీడియాలో  సల్మాన్ రాసిన ప్రేమ లేక  వైరల్ అవుతోంది. ఈ లేఖను సల్మాన్ స్వయంగా రాసినట్లు చెపుతున్నారు. 34 ఏళ్ల క్రితం రాసిన ఈ ప్రేమలేఖ.. సల్మాన్ ఖాన్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం రాసినట్లు తెలుస్తోంది. అయితే  1989లో సల్మాన్ ఈ లేఖ  రాశారు. ఈ లేఖలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తున్నాను అని ఉంది.    మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ లెటర్ తన ప్రియురాలి కోసం రాయలేదట సల్మాన్ ఖాన్. కాస్త వెరైటీగా ఉంటుందని అభిమానుల కోసం ఈ లేఖ రాశాడని తెలుస్తోంది. అయితే ఈ ఏఖకు సందర్భం ఏంటో తెలుసా..? సల్మాన్ ఖాన్  హీరోగా బ్లాక బస్టర్ హిట్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ  మైనే ప్యార్ కియా. ఈ సినిమా  భారీ విజయాన్ని అందుకోవడంతో సల్మాన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.    ఎన్టీఆర్ – కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?     అప్పుడే తన రొమాంటిక్ సెన్స్ ను ఏపయోగించి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే పని చేశాడు సల్మాన్ ఖాన్.  సల్మాన్ తన అభిమానులకి లేఖ రాశారు. 29 డిసెంబర్ 1989 న విడుదలైంది మూవీ. సల్మాన్ నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 1990లో రాశారు ఈ లేఖలో నన్ను అంగీకరించినందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.    ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?   మొదటిగా నేను మీకు  ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఇక ముందు కూడా  మంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను ఇకనుండి ఏ సినిమా చేసిన మైనే ప్యార్ కియా తో పోలుస్తారని నాకు తెలుసు కనుక మంచి సినిమా చేయాడానికి 100 శాంత ప్రయత్నిస్తాను అని రాశారు సల్మాన్ ఖాన్.    అనుకున్నట్టుగానే ఈ లెటర్ ఫుల్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈలెటర్ తో సల్మాన్ ఖాన్కు ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. అంతేనా.. ఆయన అంటే లేడీస్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ను చూస్తే చాలు అన్నంతలా క్రేజ్ తో పాటు.. బాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు సల్లు భాయి. కాని 58 ఏళ్ళు వచ్చినా.. ఇంకా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. 

  • విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో … చంద్రబాబు, పవన్ లతో కలిసి ముందుకు…
    on May 8, 2024 at 1:57 pm

    విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడలో రోడ్ షో చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడకు చేరుకున్న ప్రధాని మోదీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు. విజయవాడ పివిపి మాల్ దగ్గర ప్రారంభమైన ఈ రోడ్ షో  బెంజ్ సర్కిల్ వరకు సాగుతుంది.  విజయవాడ వాసులే కాదు చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రధాని మోదీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు తమ పార్టీజెండాలు చేతబట్టుకుని తమ అభిమాన నాయకులు ముగ్గురు కలిసివస్తుంటే చూసి ఆనందిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ ముందుకు కదులుతున్నారు.  కూటమి నాయకులు ప్రయాణించే వాహనంముందు మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు కదులుతున్నారు. అలాగే మోదీని చూసేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు.  తమ అభిమాన నాయకులపై పూలు చల్లుతూ భారీ నినాదాలు చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈ రోడ్ షో సాగుతోంది.  ప్రధాని శ్రీ @narendramodi గారి విజయవాడ రోడ్డుషో ప్రత్యక్ష ప్రసారం#NDAInYcpOuthttps://t.co/2H0fAdaCYn — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 8, 2024  

  • నీ బతుకేందో చెత్త ము..* , చెత్త ల..* షర్మిలాపై శ్రీరెడ్డి బూతుల వర్షం చూశారా? ఆరాచకం
    on May 8, 2024 at 1:53 pm

    నీ బతుకేందో చెత్త ము..* , చెత్త ల..* షర్మిలాపై శ్రీరెడ్డి బూతుల వర్షం చూశారా? ఆరాచకం

  • సూర్య సునామీ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య రికార్డులు బ్రేక్
    on May 8, 2024 at 1:46 pm

    Surya Kumar Yadav : ఐపీఎల్ 2024 55వ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్  జట్టు ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్  యాదవ్ సూపర్ సెంచరీ (102 పరుగులు) తో దుమ్మురేపాడు. నటరాజన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది తన సెంచరీని పూర్తి చేశాడు. ముంబై మరో విజయాన్ని అందించాడు. సూర్య కుమార్ యాదవ్ కేవలం 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ బాదాడు. 200 స్ట్రైక్ రేట్ తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. తన సెంచరీతో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. సచిన్-జయసూర్య రికార్డులు బ్రేక్..  ముంబైకి విన్నింగ్స్ సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ముంబై తరఫున సూర్యకుమార్ రెండో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మతో సమానంగా నిలిచాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. అలాగే,  ముంబై తరఫున అత్యధిక సెంచరీలలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, లెండిల్ సిమన్స్, కామెరాన్ గ్రీన్‌లను అధిగమించాడు. ఈ ఆటగాళ్లలో ఒక్కొక్కరు ఒక సెంచరీ సాధించారు. కేెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ లతో సమంగా..  టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున ఆరు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ఈ విషయంలో రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లతో సమంగా నిలిచాడు. వీరి కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో కోహ్లీకి 9 సెంచరీలు చేయగా,  రోహిత్ శర్మ 8 సెంచరీలు సాధించాడు. దీంతో పాటు సూర్యకుమార్ నంబర్-4 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు ఒకే ఓవ‌ర్ లో 4 4 4 6 4 6.. ఊచ‌కోత‌కు కేరాఫ్ అడ్ర‌స్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.. అలాగే, తిలక్ వర్మతో కలిసి సూర్యకుమార్ నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఛేజింగ్ లో నాలుగో లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ విషయంలో గురుకీరత్ సింగ్, షిమ్రాన్ హెట్మెయర్ మొదటి స్థానంలో ఉన్నారు. ముంబై త‌ర‌ఫున ఇదే అత్య‌ధికం. 143* – తిలక్ వర్మ-సూర్యకుమార్ vs సన్‌రైజర్స్, వాంఖడే, 2024 131* – కోరీ అండర్సన్-రోహిత్ శర్మ vs కేకేఆర్, కోల్‌కతా, 2015 122* – కీరన్ పొలార్డ్ – అంబటి రాయుడు vs ఆర్సీబీ, బెంగళూరు, 2012 టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 జెర్సీలో ఒక్క ‘స్టార్’ మాత్ర‌మే ఎందుకు ఉంది?

  • Tollywood Updates: కాజల్‌కి నచ్చిన పాట.. కార్తికేయ సినిమా రిలీజ్‌ డేట్‌.. సత్యదేవ్‌ చెప్పే `కృష్ణమ్మ` కథ..
    on May 8, 2024 at 1:20 pm

    తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. అయితే ఆమె లేడీ ఓరియెంట్‌ చిత్రాలతో అలరించేందుకు వస్తుంది. కానీ తనకి మాత్రం వేరే మూవీ పాట నచ్చిందట. శివ మల్లాల తెలుగులో అందిస్తున్న `సత్య` చిత్రంలోని నిజమా ప్రాణమా ` పాట బాగుందని, తనకు నచ్చిందని చెప్పింది.ఆమె ఈ పాటని విడుదల చేసింది. `సత్య` సినిమా ఈనెల 10న రిలీజ్‌ కానున్న నేపథ్యంలో కాజల్‌ ఈ పాటని రిలీజ్‌ చేసి శివతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. టీమ్‌కి అభినందనలు తెలియజేసింది.  నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ, కాజల్ తో అనుబంధాన్ని పంచుకున్నారు.  `లక్ష్మి కళ్యాణం` సినిమా నుండి పరిచయమని ఆమె ఎదిగిన తీరుని అప్రిషియేట్‌ చేశారు. ఆమె తనకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. హమరీష్‌, ప్రార్థన జంటగా నటించిన `సత్య` చిత్రానికి వాలి మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో హిట్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో శివ మల్లాల తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి సినిమా థియేటర్లోకి రానుంది.   కార్తికేయ గుమ్మకొండ `భజే వాయు వేగం` రిలీజ్‌ డేట్‌.. కార్తికేయ గుమ్మకొండ `ఆర్‌ఎక్స్ 100` తో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ పడలేదు. ఈ క్రమంలో సక్సెస్‌ కోసం ఆయన స్ట్రగుల్‌ సాగుతూనే ఉంది. తాజాగా `భజే వాయు వేగం` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్  ఈచిత్రం రూపొందుతుంది. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది.  ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. `హ్యాపీ డేస్` ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా “భజే వాయు వేగం” సినిమా రూపొందింది. రేపు (గురువారం) ఉదయం 9.09 నిమిషాలకు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ `పిచ్చిగా సెట్ అయ్యిందే’ని రిలీజ్‌ చేస్తున్నారు.  The pitch is ready for the Final Showdown 🏏#BhajeVaayuVegam hitting theatres Worldwide on May 31st 🎯 Get ready for a CRAZY RIDE 🚘🏁#BVVonMay31st 💥@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil @ramjowrites @vishwa_raghu pic.twitter.com/w5vHrCY4St — UVConcepts (@UVConcepts_) May 8, 2024 స్నేహం, జీవితాల భావోద్వేగ కథే ‘కృష్ణమ్మ’: సత్యదేవ్   విలక్షణ నటుడుగా రాణిస్తున్నారు సత్యదేవ్‌. ఆయన తాజాగా `కృష్ణమ్మ` చిత్రంలో హీరోగా నటించారు. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. తాజాగా సత్యదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ, స్నేహం, జీవితాల విలువని తెలియజేసే చిత్రమిది అన్నారు. `విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు. కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితాలు, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. కానీ అలాంటి డ్రీమ్ చెడగొడితే వీళ్ళు ఏం చేశారు అనేదే ఈ మూవీ` అని తెలిపారు సత్యదేవ్‌. రివేంజ్‌ హైలైట్‌గా నిలుస్తుందన్నారు.   

  • ఢిల్లీకి పయనమైన చిరంజీవి…రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ ప్రదానం!
    on May 8, 2024 at 1:19 pm

    నాలుగు దశాబ్దాలు పైగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో చిరంజీవి ఒకరు. నటుడిగా వినోదం పంచుతూనే సామాజికవేత్తగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేసి సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. చిరంజీవి సేవలకు గాను భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ చే గౌరవించింది.  ఈ ఏడాదికి గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా… చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. మే 9 గురువారం చిరంజీవి ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన సైతం ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఇక ఏడుపదుల వయసులో కూడా చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. నెక్స్ట్ ఆయన విశ్వంభర మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్ర దర్శకుడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.  చిరంజీవి జంటగా త్రిష నటిస్తుంది. ఈషా చావ్లా, సురభి వంటి యంగ్ హీరోయిన్స్ సైతం జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం చిరంజీవి రియల్ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. కఠిన యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా డూప్ లేకుండా నటిస్తున్నాడట. విశ్వంభర చిత్రంపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. 

  • చిరంజీవికి 18 సీట్లు వస్తే ఏం చేశాడో తెలుసా.. పోసాని సంచలన వ్యాఖ్యలు
    on May 8, 2024 at 1:19 pm

    చిరంజీవికి 18 సీట్లు వస్తే ఏం చేశాడో తెలుసా.. పోసాని సంచలన వ్యాఖ్యలు

  • పిఠాపురంలో ప్రతి ఇల్లు తిరుగుతున్న నిర్మాత నాగవంశీ..పవన్ కోసం ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి
    on May 8, 2024 at 1:15 pm

    పిఠాపురంలో ప్రతి ఇల్లు తిరుగుతున్న నిర్మాత నాగవంశీ..పవన్ కోసం ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి

  • మోడీకి 10 ఛార్జ్ షీట్లు పంపిస్తా.. ఆంధ్ర ప్రజలకి ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ షర్మిల సంచలనం
    on May 8, 2024 at 1:13 pm

    మోడీకి 10 ఛార్జ్ షీట్లు పంపిస్తా.. ఆంధ్ర ప్రజలకి ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ షర్మిల సంచలనం

  • కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?
    on May 8, 2024 at 12:37 pm

    సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది స్టార్ నటి రమ్యకృష్ణ. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లలో సిల్వర్ స్క్రీన్ పై వెలుగు వెలుగుతోంది రమ్యకృష్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చేసిన ఈమె..తాజాగా కాస్టింగ్ కౌచ్ పే చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.    ప్రస్తుతం  తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తుంది రమ్యకృష్ణ.  ఇక ఇన్నేళ్ల నుంచి పీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ.. ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాక్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అది కూడా కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసినట్టుగా చెపుతున్న వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఆమె ఏమన్నదంటే..?    హీరోయిన్ గా సౌత్ ఇండియాన్ సినిమాలు ఊపు ఊపేసింది రమ్యకృష్ణ.  ప్రస్తుతం క్యారెక్టర్స్ రోల్స్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ.. ఆకట్టుకుంటుంది. శివగామిపాత్ర కాని.. రంగమార్తాండ సినిమాలో తల్లి పాత్ర,  జైలర్ సినిమాలో రజినీకాంత్ భార్యగా, ఇలా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటుంది రమ్య కృష్ణ.    మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..? ఇప్పటివరకు తెలుగు,తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో దాదాపుగా  300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు రమ్య కృష్ణ. ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇక ఈసినిమా ఆమె కెరీర్ లో నే అద్భుతం అని చెప్పవచ్చు. హీరో పాత్ర తరువాత రమ్య కృష్ణ పాత్రకే అంత పేరు వచ్చింది.    రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ హిట్ ను వదిలేసుకున్న పవర్ స్టార్..?     కాగా రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ గురించి రమ్యకృష్ణ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. చిన్న హీరోయిన్లు.. జూనియర్ ఆర్టిస్ట్ లే కాదు… స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులే. అంతే కాదు ఇందులో మగవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈక్రమంలో రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.    ఎన్టీఆర్ – కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?   రమ్యకృష్ణ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదు.. అన్ని  ఇతర రంగాల్లోనూ ఉంది. కాని ఒక్క సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేస్తూ.. సినిమా వాళ్ళను మాత్రమే బయటపడేస్తున్నారు.  సెలబ్రిటీలు ఎక్కవగా ఉండటంతో ఈ రంగాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది.    కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య – జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..? అంతే కాదు తమ స్వలాభం కోసం కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని రమ్యకృష్ణ అన్నట్టు  మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె నిజంగా ఈ వాఖ్యలు చేశారా లేక సోషల్ మీడియాలో మాత్రమ ఇలా రూమర్ స్ప్రెడ్ అయ్యిందా అనేది తెలియాల్సి ఉంది. . ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారాయి.  ఇక రమ్యకృష్ణ చేశారు అని ప్రచారం జరుగుతున్న ఈ  కామెంట్స్ పై సోషల్ మీడియా జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు శివగామి. ఇక తర కెరీర్ లో  నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు,  మూడు నంది అవార్డులు అందుకున్నారు రమ్య కృష్ణ.   

  • అయోధ్య రామమందిరానికి తాళం వేసేస్తారు…: తెలుగు గడ్డపై ప్రధాని మోదీ సంచలనం
    on May 8, 2024 at 12:35 pm

    పీలేరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాదు మాఫియా కోసం పనిచేస్తోందని అన్నారు. వైసిపి రౌడీ రాజ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు… త్వరలోనే వారికి విముక్తి కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని… బిజెపి,టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఏపీలోని మాఫియా గ్రూపులన్నింటికి ఎన్డిఏ ప్రభుత్వం  ట్రీట్ మెంట్ ఇస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.  రాజంపేట లోక్ సభ పరిధిలోని పీలేరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి సర్కార్, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. వైసిపి సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని ఆయన హెచ్చరించారు. రాయలసీమకు చెందిన అనేకమంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఇక్కడ అభివృద్ది జరగలేదని అన్నారు. రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు… ఇదంతా గమనిస్తున్న వారు ఓటేసేముందు ఆలోచించాలని ప్రధాని మోదీ సూచించారు.  రాయలసీమకు సాగునీరు, తాగునీరు కూడా  సరిగ్గా అందడం లేదు… అందువల్లే ఈ ప్రాంతం బాగా వెనకబడి పోయిందని ప్రధాని అన్నారు. అందువల్లే ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. సీమ ప్రజల కష్టాలు పోవాలంటూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని అన్నారు. ఎంతో నమ్మకంతో వైసిపిని  గెలిపించి అధికారం కట్టబెట్టి మరోసారి ప్రజలు మోసపోయారని అన్నారు. ఈ ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ది జరక్కపోగా విధ్వంసం జరిగిందన్నారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు.  ఇక దేశాన్ని మరోసారి విభజించి పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని… అందులో భాగంగానే తెల్లవాళ్లు, నల్లవాళ్లు అంటూ కొందరు కామెంట్స్  చేస్తున్నారని ప్రధాని అన్నారు.  విభిన్న జాతుల సమూహమే మన దేశం… అంలాంటిది దేశ ప్రజలను అవమానించేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకువస్తామని, రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ అంటోంది… అలాంటి పార్టీకి ఓటేద్దామా? అని మోదీ ప్రశ్నించారు. దేశంలో ఇలాగే శాంతిభద్రతలు కొనసాగాలంటే, విదేశాల్లో భారతీయులకు గౌరవం దక్కాలంటే, ప్రజలంతా సుఖంగా వుండాలంటే మళ్లీ ఎన్డిఏ అధికారంలోకి రావాలని ప్రధాని తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అన్నిరకాలుగా అభివృద్ది చెందాలంటు ఎన్డీఏను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. రాయలసీమ స్థితిగతులను కేవలం ఏన్డీఏ మాత్రమే తీర్చగలదని అన్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని బిజెపి కోరుకుంటోందని అన్నారు. ఇప్పటికే కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరయ్యిందని, కడప విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణంలో వుందన్నారు. ఇలా రాయలసీమ అభివృద్దికోసం ఎన్డిఏ ఎంతో చేస్తోంది… మళ్ళీ అధికారంలోకి రాగానే ఇంకెంతో చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.   

  • ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు… పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?
    on May 8, 2024 at 12:10 pm

    ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని చెప్పాలి.    అధికారిక వైఎస్సార్సీపీని గద్దె దింపాలని బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇటు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే కూటమి అధికారం మాదే అంటూ విశ్వాసం ప్రకటిస్తున్నాయి. కాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేశాడు. వారి వారి జాతకాల ఆధారంగా ఆయన ఈ అంచనా వేశాడు. వేణు స్వామి జ్యోతిష్యం ప్రకారం ఎన్డీయే కూటమికి షాక్ తప్పదట. మరలా వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపడతాడట. పవన్ కళ్యాణ్-చంద్రబాబు జాతకాల రీత్యా పొత్తు వలన పెద్దగా ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. వేణు స్వామి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖాయం.    గ్రహాల రీత్యా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవి ప్రతికూల నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలకు అసలు పొసగదు. కాబట్టి వీరిద్దరూ పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు, అన్నారు.    ఇంకా మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నక్షత్రాల ప్రభావం కూటమి మీద పడుతుంది. దాని వలన ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. కూటమికి ఓటమి తప్పదు. మళ్ళీ వైఎస్సార్సీపీ ఏపీలో గెలిచి అధికారం చేపడుతుంది. పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే యోగం లేదు. అది ఎప్పటికీ జరగదు. నాకు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ద్వేషం లేదు. ఆయన జాతకం ప్రకారమే చెబుతున్నాని, అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిచేది లేనిది వేణు స్వామి చెప్పలేదు. వేణు స్వామి కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు వేణు స్వామి మీద మండిపడుతున్నారు.   

  • మరోసారి కలుస్తున్న రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ.. రౌడీబాయ్‌ దిమ్మతిరిగే లైనప్‌.. ఈ బర్త్ డే చాలా స్పెషల్‌
    on May 8, 2024 at 12:06 pm

    విజయ్‌ దేవరకొండ ఈ బర్త్ డేకి బ్యాక్‌ టూ బ్యాక్‌ సర్‌ప్రైజ్‌లతో రాబోతున్నారు. తన లైనప్‌లో ఉన్న సినిమాల అప్‌ డేట్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాదు రష్మికతో మరోసారి జోడీ కడుతున్నాడట.    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిన్న చిన్న రోల్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో విజయ్‌ చేసిన అల్లరి మామూలు కాదు. ఆయన ఎనర్జీ నానిని డామినేట్‌ చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సోలో హీరోగా `పెళ్లి చూపులు` పడింది. తరుణ్‌ భాస్కర్‌ ఈ మూవీని తెరకెక్కించారు. చిన్నగా వచ్చి పెద్ద విజయం సాధించింది. హీరోగా విజయ్‌కి ఊపిరి పోసింది.   ఈ క్రమంలోనే రౌడీ బాయ్‌కి ఆ ట్యాగ్‌ తెచ్చేమూవీ పడింది. సందీప్‌ రెడ్డి వంగా రూపంలో `అర్జున్‌ రెడ్డి` పడింది. ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీని షేక్‌చేసింది. సినిమా మేకింగ్‌ పరంగా, హీరోయిజం పరంగా బౌండరీలు బ్రేక్‌ చేసిన చిత్రమిది. దీంతో విపరీతమైన కల్ట్ ఫ్యాన్‌ ఏర్పడింది. మాస్‌లోకి వెళ్లిపోయాడు విజయ్‌. దీంతో మేకర్స్ సైతం ఆయనతో సినిమాలకు క్యూ కట్టారు. ఆ వెంటనే `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ పడింది. పరశురామ్‌ మంచి ఫ్యామిలీ లవ్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారు. ఈ చిత్రం వంద కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీకి షాకిచ్చింది.    దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్లతో విజయ్‌ రేంజ్‌మారిపోయింది. స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి, బన్నీ లాంటి వాళ్లు ఆయన్ని అభినందించారు. అదే సమయంలో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఒకప్పుడు ఉదయ్‌ కిరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, తరుణ్‌లకు ఎలా అయితే ఫాలోయింగ్‌ వచ్చిందో, విజయ్‌కి ఆ రేంజ్‌ క్రేజ్‌ రావడం విశేషం. ఇండస్ట్రీ మొత్తం అతని గురించే చర్చ. తనగురించే అంతా మాట్లాడుకునేలా చేశాడు విజయ్‌. కానీ ఆ తర్వాత సరైన హిట్‌ పడలేదు. తన రేంజ్‌ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు విజయ్‌. `ఖుషి` ఫర్వాలేదనిపించుకోగా, ఇటీవల వచ్చిన `ఫ్యామిలీ స్టార్‌` డిజాప్పాయింట్‌ చేసింది.    ఇప్పుడు భారీ లైనప్‌తో ముందుకెళ్తున్నాడు విజయ్‌. ఆ మధ్య `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ ఆయన్ని కలవడం విశేషం. వీరి కాంబోలో సినిమా రాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమచారం మేరకు విజయ్‌ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం విజయ్‌ `వీడీ12` చిత్రంలో గౌతమ్‌ తిన్ననూరితో చేస్తున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే యాక్షన్‌ మూవీ ఇది. నెక్ట్స్ లెవల్‌ ప్లానింగ్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.   మరోవైపు ఇటీవల `రాజావారు రాణిగారు` ఫేమ్‌ రవికిరణ్‌ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్‌ అయ్యారు. దిల్‌ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఇది `వీడీ15`గా తెరకెక్కబోతుంది. దీని కంటే ముందే తనకు `టాక్సీవాలా` వంటి చిత్రాన్ని ఇచ్చిన రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్‌. అయితే ఇందులో రష్మిక మందన్నా పేరు వినిపిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.    ఇదిలా ఉంటే రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీలో హీరోయిన్‌గా నేషనల్‌ క్రష్‌ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే `గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి జోడీ కడుతున్నారట. అయితే విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రష్మిక కూడా అలాంటి హింట్లే ఇస్తూ వస్తోంది. మరి ఈ బర్త్ డేకి తన ప్రియుడి కోసం నేషనల్‌ క్రష్‌ ఏం చేయబోతుందో చూడాలి.   అయితే రేపు మే 9న విజయ్‌ దేవరకొండ తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రాబోతున్నాయట. దీంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేకంగా బర్త్ డే సీడీపీ కూడా రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.